Breaking News

రియల్‌ టైమ్‌లో పట్టేస్తున్నారు!

Published on Fri, 02/28/2025 - 06:23

సాక్షి, హైదరాబాద్‌: నేరస్తుల ఆట కట్టించటంలో తెలంగాణ పోలీసులు ఇతరులకంటే ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటున్నారు. ప్రస్తుతం వీరు వాడుతున్న ఫింగర్‌ ప్రింట్‌ మొబైల్‌ సెక్యూరిటీ డివైస్‌లు నేరస్తులను గుర్తించటంలో అద్భుత ఫలితాలిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో విధుల్లో ఉండే పోలీస్‌ సిబ్బందితోపాటు స్పెషల్‌ బ్రాంచి (ఎస్‌బీ) సిబ్బంది ఈ డివైజ్‌లు వాడుతున్నారు. అనుమానితుల వేలిముద్రలను తీసుకుని పోలీస్‌ డేటాబేస్‌లోని వేలిముద్రలతో సరిపోల్చి చూస్తున్నారు.

దీంతో రియల్‌ టైంలోనే నేరస్తులను గుర్తించగలుగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి ప్రారంభం నుంచి ఫిబ్రవరి 15 వరకు ఫింగర్‌ప్రింట్‌ మొబైల్‌ సెక్యూరిటీ డివైజ్‌ల ద్వారా 17 మంది వాంటెడ్‌ క్రిమినల్స్‌ను గుర్తించారు. పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాల తనిఖీ సమయంలోనూ ఎస్‌బీ సిబ్బంది ఈ డివైజ్‌లను వినియోగిస్తున్నారు.

దరఖాస్తుదారుడు తనపై ఉన్న కేసుల వివరాలు దాచినా.. ఈ డివైజ్‌ ద్వారా పాత కేసులను గుర్తించవచ్చు. ఇటీవల ఇలా ఓ నేరస్తుడిని గుర్తించారు. అనాథ శవాల వివరాలు కనుక్కోవడం కోసం కూడా వీటిని వినియోగిస్తున్నారు. చనిపోయిన వారి వేలిముద్రల ఆధారంగా వారి వివరాలు గుర్తిస్తున్నారు. ఇలా ఈ ఏడాది ఇప్పటివరకు 8 అనాథ శవాల వివరాలు గుర్తించారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)