Breaking News

గవర్నర్‌పై కౌశిక్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీ నేతలు ఫైర్‌

Published on Fri, 01/27/2023 - 13:53

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మాటల దాడి మరింత పెరిగింది.  రిపబ్లిక్‌ డే వేడుకల సందర్భంగా గవర్నర్‌పై ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. 

కాగా, కౌశిక్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కౌశిక్‌ రెడ్డిపై కాషాయ నేతలు పోలీసులను ఆశ్రయించారు. అనంతరం, ఎమ్మెల్సీపై సరూర్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గవర్నర్‌ తమిళిసైపై వ్యాఖ్యలకు గానూ కౌశిక్‌ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కార్పొరేటర్‌ శ్రీవాణి కోరారు. 

ఇక, రిపబ్లిక్‌ వేడుకల సందర్భంగా జమ్మికుంటలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కౌశిక్ రెడ్డి షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. గవర్నర్ తమిళిసై ఏ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారంటూ ప్రశ్నించారు. అసెంబ్లీ, కౌన్సిల్‌లో పాస్ చెసిన‌ బిల్లుల ఫైళ్లను గవర్నర్ ఎందుకు దాచుకున్నారంటూ అనుచిత పదజాలాన్ని ఎమ్మెల్సీ ఉపయోగించారు. ఇది రాజ్యాంగమా అంటూ నిలదీశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ క్రమంలో  హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను నిలదీస్తూ ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలో కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)