Breaking News

Telangana: రూ. 50 వేలకు మించి తీసుకెళ్లొద్దు

Published on Tue, 02/18/2025 - 13:48

నిజామాబాద్‌: పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల(mlc elections) నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల నియమావళి అమలులో ఉంది. అభ్యర్థుల ప్రచారాలు, హడావుడి అంతగా లేకపోవడంతో ఎన్నికల కోడ్‌(Election Code) విషయం చాలా మందికి తెలియడం లేదు. చాలా చోట్ల సాధారణ రోజుల మాదిరిగానే నగదును తీసుకొని ప్రయాణిస్తున్నారు. ప్రజలు రూ.50వేలకు మించి నగదుతో ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా ఆధారాలు ఉండాలని, లేకపోతే సీజ్‌ చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, (Nizamabad)మెదక్‌ ఉమ్మడి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 56, టీచర్‌ ఎమ్మెల్సీకి 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ నెల 27న పోలింగ్‌ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్‌ దగ్గర పడుతుండటంతో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు ప్రలోభాలకు తెర తీసినట్లు తెలిసింది. దీంతో ఎన్నికల అధికారులు నగదు తరలింపు, ఇతర వ్యవహారాలు జరగకుండా అడ్డుకట్ట వేసేందుకు దృష్టి సారించారు.

ఆధారాలు లేకపోతే సీజ్‌
ఎన్నికల నియమావళి ప్రకారం ప్రజలు రూ. 50 వేల నగదుకు మించి తీసుకువెళితే సంబంధిత ఆధారాలను అధికారులకు చూపించాల్సి ఉంటుంది. లేకుంటే వాటిని సీజ్‌ చేసే అధికారం అధికారులకు ఉంటుంది. బ్యాంక్‌ నుంచి విత్‌ డ్రా చేసిన నగదు, అప్పుగా, పంటలు అమ్మిన వచ్చిన డబ్బులతోపాటు బంగారం, వెండి కొనుగోలు చేసినా వాటికి ఇచ్చే రసీదులను వెంట ఉంచుకోవాల్సిందే. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ ఉండటంతో బంగారం, వెండి, చీరలు ఇతరత్రా సామగ్రి కొనుగోలు చేసినా వాటికి సంబంధించిన రసీదులను వెంట పెట్టుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

సరిహద్దుల్లో కట్టుదిట్టం
జిల్లాకు సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి నిత్యం వేలాది మంది నిజామాబాద్‌తోపాటు కామారెడ్డి, హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటారు. ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులు, కార్లు, వాహనాలను చెక్‌పోస్టుల వద్ద పోలీసులు, ఎన్నికల అధికారులు తనిఖీ చేస్తున్నారు. సరైన ఆధారాలు చూపని నగదు, సామగ్రిని స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నగదు తీసుకెళ్లే వారు ఏమరుపాటుగా ఉండకుండా జాగ్రత్త వహిస్తూ ఆధారాలు దగ్గర ఉంచుకోవాలని, లేకపోతే నగదు సీజ్‌ అయ్యే ఆస్కారం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

సరైన ఆధారాలు ఉండాలి
కోడ్‌ అమలులో ఉన్నందున ఎన్నికల సిబ్బందితో కలిసి తనిఖీలు ముమ్మరం చేశాం. పెళ్లిళ్లు, పంట విక్రయాలు చేసేవారు నగదు తీసుకువెళ్లేటప్పుడు తప్పనిసరిగా రసీదులు, ఆధార పత్రాలను వెంట ఉంచుకోవాలి. రూ.50 వేల నుంచి రూ.10 లక్షల లోపు నగదును పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. సరైన ఆధారాలు చూపిస్తే ఎన్నికల అధికారుల ద్వారా తిరిగి అందజేస్తాం.
– రాజావెంకట్‌రెడ్డి, ఏసీపీ, నిజామాబాద్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)