Breaking News

నాసిరకంగా కట్టింది కాక.. ఇప్పుడు ఇలాంటి ప్రకటనలా?

Published on Sun, 08/17/2025 - 04:48

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చేసేందుకు ఎవరో ప్రయత్నాలు చేశారని బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఇప్పుడు మాట్లాడటం దొంగలు పడ్డ రెండేళ్లకు కుక్కలు మొరిగినట్టుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ వ్యాఖ్యానించారు. నాసిరకం పనులు చేసి, కుంగిపోయేట్టు ప్రాజెక్టులు నిర్మించి, అనువుగాని చోట కట్టి అభాసుపాలయింది కాక, ఇప్పుడు ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా ఆ పార్టీ మరింత దిగజారుతోందని ఎద్దేవా చేశారు.

శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయిన తర్వాత రెండున్నర నెలలు బీఆర్‌ఎస్‌ పార్టీనే అధికారంలో ఉందని, అప్పుడు ఆ పార్టీ ముఖ్య నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. ఘటన జరిగినప్పుడు కాంగ్రెస్, బీజేపీ, జేఏసీ నేతలతో సహా ఎవరినీ అక్కడకు వెళ్లనీయలేదని అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో లుకలుకలతో అధికారం పోవాలని అసలు ఆ ప్రాజెక్టును కూల్చింది కేసీఆరో, కేటీఆరో, కవితనో, హరీశ్‌రావో మీరే తేల్చుకోవాలని వ్యాఖ్యానించారు.

తమ విలాసవంతమైన జీవితం ఎక్కడ బయటపడుతోందోనని అధికారం పోయిన తర్వాత ప్రగతిభవన్‌ నుంచి విలువైన వస్తువులన్నింటినీ కేసీఆర్‌ కుటుంబం తీసుకెళ్లిపోయిందని ఆరోపించారు. బంగారం, వెండి, విలువైన ఫర్నిచర్‌ను రెండు లారీల్లో సర్దుకువెళ్లారని, కేవలం ఖాళీ కుర్చీలు, గోడలు మాత్రమే మిగిల్చి వెళ్లారని అద్దంకి దయాకర్‌ ధ్వజమెత్తారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)