Breaking News

Rega Kantha Rao Vs Podem Veeraiah: స్టేజీపైనే బాహాబాహీ.. నీకు మైండ్‌ ఉందా.. నువ్వు నోర్మూసుకో..!

Published on Thu, 05/11/2023 - 03:57

దుమ్ముగూడెం: తునికాకు బోనస్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మాటామాటా పెరిగి ఒకరిపైకి ఒకరు దూసుకురావడంతో పాటు గల్లాలు పట్టుకునేందుకు రెడీ అయ్యారు. పరిస్థితి చేయిదాటుతుండటంతో అక్కడే ఉన్న కలెక్టర్, ఎస్పీ, అటవీ అధికారులు సర్దిచెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం ములకపాడులో బుధవారం తునికాకు బోనస్‌ చెక్కుల పంపిణీకి సమావేశం ఏర్పాటు చేశారు.

కార్యక్రమంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, విప్‌ కాంతారావు, ఎమ్మెల్యే వీరయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ మూడో సారి కూడా కేసీఆర్‌ సీఎం అవుతారని, రాబోయే ఎన్నికల్లో భద్రాచలం నుంచి గెలిచేది బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థేనంటూ తన ప్రసంగం కొనసాగించారు. దీనికి వేదికపై ఉన్న భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య(కాంగ్రెస్‌) జోక్యం చేసుకుని ఇది ప్రభుత్వ కార్యక్రమమని..ఇక్కడ రాజకీయాలెందుకంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే కాంతారావు మరింత దూకుడుగా ప్రసంగం కొనసాగిస్తూ ప్రతిపక్షాలనుద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు.

ప్రసంగం ముగించి తన సీట్లో కూర్చునే సమయంలోనూ ప్రభుత్వ పథకాల గురించి చెబుతుంటే బాధెందుకు అంటూ పోదెంను ఉద్దేశించి అన్నారు. ఇందుకు వీరయ్య ‘నువ్వు నా నియోజకవర్గానికి వచ్చి ఇష్టం వచ్చి నట్టు మాట్లాడితే కుదరదంటూ’హెచ్చు స్వరంతో బదులిచ్చారు. దీంతో నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో నీకు మైండ్‌ ఉందా అంటూ పోదెం అనగా.. నువ్వు నోర్మూసుకో అంటూ విప్‌ అన్నారు.

ఇలా అభ్యంతరకమైన పదాలతో దూషించుకుంటూనే ఒకరిపై ఒకరు దూసుకొచ్చారు. వేదికపై ప్రసంగించేందుకు సిద్ధమైన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిశ్చేషు్టడై చూస్తుండిపోయారు. ఇద్దరూ భౌతికదాడులకు దిగే విధంగా పరిస్థితి నెలకొనడంతో అక్కడే ఉన్న కలెక్టర్‌ అనుదీప్, పీసీసీఎఫ్‌ డోబ్రియల్‌ కల్పించుకుని రేగా చేయి పట్టుకుని వెనక్కి తీసుకెళ్లి కూర్చోబెట్టగా ఎస్పీ వినీత్‌ ఎమ్మెల్యే పొదెంను సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది. 

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)