Breaking News

సీపీ వర్సెస్‌ పాడి!

Published on Tue, 03/03/2026 - 08:08

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌: కరీంనగర్‌ పోలీసులు లక్ష్యంగా హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మరోసారి వాగ్బాణాలు సంధించడం రాష్ట్రవ్యాప్త చర్చకు దారితీస్తోంది. ఇటీవల పోలీసు కమిషనర్‌ గౌస్‌ ఆలం లక్ష్యంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన పాడి ఆ తరువాత తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తాజాగా ఆయనే మరోసారి సీపీ, ఇతర పోలీసులు లక్ష్యంగా అవినీతి ఆరోపణలు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా ఓ షాపింగ్‌ విషయంలో పోలీసులు భారీగా ముడుపులు స్వీకరించారని, ఏసీపీ విజయ్‌కుమార్, మరో ఇన్‌స్పెక్టర్‌ సృజన్‌రెడ్డి లక్ష్యంగా బలవంతంగా డబ్బులు వసూలు చేశారని హైదరాబాద్‌లో పాడి పెట్టిన ప్రెస్‌మీట్‌తో కరీంనగర్‌ ఉలిక్కిపడింది. 

తన వద్ద వారి అవినీతి, అక్రమాలకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని, కుటుంబ సభ్యుల కోసం పోలీసు వాహనాలను దుర్వినియోగం చేస్తున్నారని, సీఎం రేవంత్‌కే ఆ ఆధారాలు చూపిస్తానని, అవసరమైతే అసెంబ్లీ వేదికగా బయటపెడతానని హెచ్చరించారు. డిపార్ట్‌మెంట్‌లో ఈ వివాదం చర్చానీయాంశంగా మారింది. తమపై ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పోలీసులు మండిపడుతుంటే.. పాడి వర్గీయులు మాత్రం తమ నేత వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని పునరుద్ఘాటిస్తున్నారు.

డిపార్ట్‌మెంట్‌ ఏమంటోందంటే?
పాడి కౌశిక్‌ డిపార్ట్‌మెంట్‌పై కావాలనే కక్ష గట్టారని సీనియర్‌ ఆఫీసర్లు ఆరోపిస్తున్నారు. ఇటీవల సమ్మక్క జాతర రోజు సీఐ సృజన్, సీపీ గౌస్‌ ఆలంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడమే ఇందుకు నిదర్శనమని గుర్తుచేస్తున్నారు. ఆరోజు ఆయన్ను నిలువరించడం, కేసులు నమోదు చేయడాన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారన్నారు. కుటుంబ సభ్యులను వివాదంలోకి తీసుకురావడం తగదని హితవుపలుకుతున్నారు. వాస్తవానికి తామెవరికీ అనుకూలంగా వ్యవహరించమని, మొన్నటి వరకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనూ సేవలందించింది తామేనని మర్చిపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులను వారికి సంబంధం లేని విషయంలో ఎమ్మెల్యే ఆరోపణలు చేయడాన్ని పోలీసు సంక్షేమ సంఘం నాయకులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. వెంటనే వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

పాడిపై మరో కేసు!
మరోవైపు సమ్మక్క జాతర సమయంలో పాడిపై కేసు నమోదు చేసిన పోలీసులు మరోసారి ఆయన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నారు. తొలుత లీగల్‌ ఒపినీయన్‌ తీసుకుని, దాని ఆధారంగా ముందుకు వెళ్లనున్నారు. పాడి వ్యాఖ్యలపై ఐపీఎస్‌ అధికారుల సంఘం కూడా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. గతంలో సీపీపై అభ్యంతరకర వ్యాఖ్యల సమయంలోనూ ఐపీఎస్‌ల సంఘం క్షమాపణకు పట్టుబట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాడి చేసిన వ్యాఖ్యలపై త్వరలో కేసు నమోదు అయ్యే అవకాశం ఉందని ఓ సీనియర్‌ పోలీసు అధికారి ‘సాక్షి’కి తెలిపారు. 

వీడియోల్లో ఏముంది?
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అసెంబ్లీలో బయటపెడతారన్న వీడియోల్లో ఏమి ఉండి ఉంటుంది? అన్న విషయం ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో పాడివర్గం మాత్రం పోలీసుల అక్రమాలకు సంబంధించి తమ ఎమ్మెల్యే వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. తమ నేత ఇచ్చిన గడువులోగా సీపీపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే.. అందుకు సంబంధించిన ఆధారాలు తప్పకుండా బయటపెడతారని చెబుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే సీఎం రేవంత్, సీఎస్, డీజీపీల స్పందన కోసం వేచి చూస్తున్నామని, వారి స్పందన ఆధారంగా తమ నాయకుడి ప్రతిస్పందన ఉంటుందని వివరించారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)