Breaking News

ఓయూ 53.. జేఎన్టీయూ 94..

Published on Fri, 09/05/2025 - 05:33

సాక్షి, హైదరాబాద్‌: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) ర్యాంకుల్లో ఉస్మానియా యూనివర్సిటీ సత్తా చాటింది. ఓవరాల్‌ కేటగిరీలో 2024లో 70వ స్థానంలో ఉన్న ఓయూ.. 2025లో ఏకంగా 17 ర్యాంకులు ఎగబాకి 53వ స్థానానికి చేరింది. రాష్ట్రంలో సాంకేతిక విద్యలో కీలకంగా ఉన్న జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూహెచ్‌) ఇంజనీరింగ్‌ విద్య విభాగంలో 88 ర్యాంకు నుంచి 94వ స్థానానికి పడిపోయింది. 

2025 సంవత్సరానికి సంబంధించిన ర్యాంకులను ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ విడుదల చేసింది. బోధన, శిక్షణ, మౌలిక వసతులు, పరిశోధన, వృత్తి నైపుణ్యం మెళకువలు, ఉపాధి అవకాశాలు, ఆర్థిక పరమైన అంశాలతోపాటు ఇతర కొలమానాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులు కేటాయిస్తారు. హైదరాబాద్‌ ట్రిపుల్‌ ఐటీ కూడా ర్యాంకుల్లో సత్తా చాటింది. 2018–19 నుంచి 2023–24 సంవత్సరాల మధ్య ఆయా సంస్థల పరిధిలో ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ఇచ్చింది.  

ఉపాధి, పరిశోధనలతో ఓయూ ర్యాంకు మెరుగు 
ఓవరాల్‌ ర్యాంకు (జాతీయ సంస్థలన్నీ కలిపి)ల్లో ఉస్మానియా యూనివర్సిటీ ఈ ఏడాది 53వ స్థానం సంపాదించింది. 2024లో 70వ ర్యాంకులో ఉంది. ఓయూలో 55 మంది గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేస్తే వారిలో 35 మంది రూ.6.5 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు పొందారు. గత ఏడాదితో పోలిస్తే వేతనం పెరిగింది. 1,069 మంది పీజీ విద్యార్థులు రూ.8 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు పొందారు. గత ఏడాది ఈ సంఖ్య 756 మాత్రమే. 

స్పాన్సర్డ్‌ రిసెర్చ్‌ కార్యక్రమాలు స్వల్పంగా పెరిగాయి. అయితే రెగ్యులర్‌ ఫ్యాకల్టీ తక్కువగా ఉండటం యూనివర్సిటీని ఇప్పటికీ వేధిస్తోంది. ఆశించిన మేర ర్యాంకు రాకపోవటానికి ఇదే కారణమని అధికారులు అంటున్నారు. ఓవరాల్‌ ర్యాంకుల్లో యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ గత ఏడాది 25వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది 26వ స్థానానికి పడిపోయింది. యూనివర్సిటీల కేటగిరీ ర్యాంకుల్లో కూడా 17 నుంచి 18కి తగ్గింది.  

తగ్గిన జేఎన్టీయూహెచ్‌ 
రాష్ట్రంలో సాంకేతిక విద్యకు గుండెకాయలా ఉన్న జేఎన్టీయూహెచ్‌ ర్యాంకు ఈసారి పడిపోయింది. అయితే వివిధ విభాగాల్లో పాయింట్లు మాత్రం తమ వర్సిటీకి తగ్గలేదని అధికారులు తెలిపారు. 2024లో జేఎన్టీయూహెచ్‌కు ఇంజనీరింగ్‌ విభాగంలో 88వ ర్యాంకు రాగా, ఈసారి 94కు పడిపోయింది. విద్యార్థుల సంఖ్య పెరిగినప్పటికీ ఉత్తీర్ణత, ఉపాధి అవకాశాలు, పరిశోధనల్లో వర్సిటీ వెనుకబడటంతో ర్యాంకు తగ్గింది. ఈ విభాగంలో ఎన్‌ఐటీ వరంగల్‌ కూడా 21 స్థానం నుంచి 28వ స్థానానికి పడిపోయింది. మరోవైపు ఐఐటీ హైదరాబాద్‌ 8వ స్థానం నుంచి 7వ స్థానానికి చేరింది.  

ఫ్యాకల్టీ లేకపోవడమే కారణం 
జేఎన్టీయూహెచ్‌ ర్యాంకు తగ్గినా పాయింట్లు మాత్రం పెరిగాయి. రెగ్యులర్‌ ఫ్యాకల్టీని పెంచాల్సిన అవసరం ఉందని ఈ ర్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. పరిశోధనలు, వృత్తిపరమైన పురోగతికి అవసరమైన ఆర్థిక తోడ్పాటు కూడా అవసరం. ఈ అంశాన్ని ప్రభుత్వానికి నివేదిస్తాం. వచ్చేసారి మంచి ర్యాంకు పొందేందుకు కృషి చేస్తాం. 
– ప్రొఫెసర్‌ టి. కిషన్‌కుమార్‌ రెడ్డి, వైస్‌ చాన్స్‌లర్, జేఎన్టీయూహెచ్‌. 

సంతృప్తిగా ఉంది 
ఓవరాల్‌ ర్యాంకుల్లో ఉస్మానియా యూనివర్సిటీకి మంచి ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. పరిశోధన, బోధన సంస్కరణలపై పెడుతున్న శ్రద్ధ కారణంగానే ఈ ర్యాంకు సొంతం చేసుకుంది. యూనివర్సిటీలోని అందరి సమష్టి కృషి ఇది. భవిష్యత్‌లో మరింత ఉన్నతికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తాం.  
– ప్రొఫెసర్‌ ఎం కుమార్, వైస్‌ చాన్స్‌లర్, ఉస్మానియా యూనివర్సిటీ. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)