Breaking News

సాత్విక్‌: తప్పుల తడకగా అధికారులు రిపోర్ట్‌.. ఆవేదనలో పేరెంట్స్‌

Published on Sun, 03/05/2023 - 12:35

సాక్షి, హైదరాబాద్‌: నార్సింగి శ్రీచైతన్య కాలేజీ బ్రాంచ్‌లో విద్యార్థి సాత్విక్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, సాత్విక్‌ ఆత్మహత్యపై ఇంటర్‌ బోర్డు రంగంలోకి దిగింది. అధికారులతో కమిటీ వేసింది. తాజాగా బోర్డు కమిటీ విచారణ జరిపిన అనంతరం ప్రభుత్వానికి నివేదికను అందించింది. 

అయితే, విచారణలో భాగంగా ఇంటర్‌ బోర్డు అధికారుల నిర్లక్ష్యం బహిర్గతమైంది. విద్యార్థి సాత్విక్‌ ఆత్మహత్యపై తప్పుల తడకగా నివేదికను అందించారు అధికారులు. ఉస్మానియా మార్చురీలో మృతదేహం ఉంటే.. గాంధీ ఆసుపత్రిలో ఉన్నట్టు రిపోర్టులో​ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రిపోర్టు, అధికారులపై సాత్విక్‌ పేరెంట్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. రిపోర్టులో సాత్విక్‌కు కాలేజీలో అడ్మిషన్‌ లేదని కమిటీ తెలిపింది. ఒక కాలేజీలో అడ్మిషన్‌.. మరో కాలేజీలో క్లాసులు అని రిపోర్టులో స్పష్టం చేసింది. కాగా, దీనిపై సాత్విక్‌ తల్లిదండ్రులు స్పందించారు. వారు మీడియాతో మాట్లాడుతూ.. సాత్విక్‌ను శ్రీచైతన్య కాలేజ్‌ పేరు మద అడ్మిషన్‌ చేశాం. శ్రీచైతన్య కాలేజ్‌ నార్సింగి క్యాంపస్‌లో జాయిన్‌ చేస్తామని చెప్పారు. శ్రీచైతన్యలోనే అడ్మిషన్‌ ఇస్తున్నామని చెప్పారు. వేరే కాలేజీలో అడ్మిషన్‌ ఉన్నట్టు మాకు తెలియదు. కాలేజీ యాజమాన్యమే మా కొడుకును చంపేసింది. మాకు న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)