Breaking News

‘అగ్ని’ తొలి డైరెక్టర్‌ రామ్‌ నరైన్‌ కన్నుమూత

Published on Fri, 08/16/2024 - 05:08

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త, ‘అగ్ని’ క్షిపణి మిషన్‌ తొలి ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ రామ్‌ నరైన్‌ అగర్వాల్‌ (84) కన్నుమూశారు. వయో సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్‌లో ఉన్న స్వగృహంలో మృతి చెందారు. రాజస్తాన్‌లోని జైపూర్‌లో జన్మించిన రామ్‌ నరైన్‌.. 1983లో ప్రారంభమైన ‘అగ్ని క్షిపణి’ ప్రోగ్రామ్‌లో చేరారు. 

ఆ మిషన్‌కు తొలి ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌గా పనిచేసి.. అగ్ని క్షిపణుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆయనను ఫాదర్‌ ఆఫ్‌ అగ్ని మిస్సైల్స్‌గా పిలుస్తారు. రామ్‌ నరైన్‌ చేసిన సేవలకు 1990లో పద్మశ్రీ, 2000లో పద్మభూషణ్‌ పురస్కా­రాలు అందుకున్నారు. శనివారం మధ్యాహ్నం సంతోష్‌నగర్‌లోని నివాసం నుంచి రామ్‌ నరైన్‌ అంతిమయాత్ర ప్రారంభం అవుతుందని.. జూబ్లీహి­ల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలను నిర్వ­హించ­నున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు.

అగ్ని క్షిపణులకు ఆద్యుడు: డీఆర్డీఏ మాజీ డైరెక్టర్‌ సతీశ్‌రెడ్డి
అగ్ని క్షిపణుల అభివృద్ధి, ప్రయోగాలలో రామ్‌ నరైన్‌ అగర్వాల్‌ కీలకపాత్ర పోషించారని డీఆర్డీఏ మాజీ డైరెక్టర్‌ సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల క్షిపణి ప్రయోగాల లాంచ్‌ పాడ్స్‌ రూపకల్పనలోనూ కీలకంగా పనిచేశారని చెప్పారు. రామ్‌ కృషి వల్లే ఈరోజు భారతదేశం రక్షణరంగంలో చాలా ముందుందన్నారు. రామ్‌ నరైన్‌ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని చెప్పారు.

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)