Breaking News

తప్పతాగి.. ప్రసాదం చేయడానికి వచ్చి..

Published on Sat, 08/24/2024 - 05:29

వేములవాడ: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి కి నైవేద్య సమర్పణలో అపచారం చోటుచేసుకుంది. నైవేద్యాన్ని సిద్ధం చేసే వంట బ్రాహ్మణుడు మద్యం తాగి విధులకు వచ్చాడు. స్వామికి నిత్యం ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య నైవేద్యం సమర్పిస్తారు. అయితే స్వామివారికి శుక్ర వారం సమయానికి నైవేద్యం సిద్ధం కాకపోవడంతో ఆలయ పర్యవేక్షకులు అల్లి శంకర్, వరి నర్సయ్య వెంటనే నివేదన శాలలోకి వెళ్లి పరిశీలించగా.. నైవేద్యం సిద్ధంగా లేకపోవడంతోపాటు వంటబ్రాహ్మణుడు మద్యం మత్తులో ఉండటాన్ని గమనించారు.

సమయం దాటిపోతుండటంతో మరో బ్రాహ్మణుడితో నైవేద్యం సిద్ధం చేయించారు. హడావుడిగా సిద్ధం చేయడంవల్ల వేడిగా ఉన్న నీటిలో బియ్యాన్ని పోసి ఉడికీఉడకని నైవేద్యాన్ని స్వామివారికి నివేదించారు. అప్పటికే నివేదన సమయం అరగంట ఆలస్యమైంది. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ ఆ వంట బ్రాహ్మణుడు ఇదేవిధంగా మద్యం మత్తులో విధులు నిర్వహించటంతో మెమో జారీ చేసినట్లు గోదాం పర్యవేక్షకుడు నర్సయ్య తెలిపారు. 

ఆదాయం ఘనం.. కైంకర్యాలపై పట్టింపు కరువు
వేములవాడ రాజన్నకు భక్తుల ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం వస్తున్నా శ్రీస్వామి వారికి పవిత్రంగా సమర్పించే నైవేద్యాన్ని సిద్ధం చేయడంలో అధికా రుల నిర్లక్ష్యంపై భక్తుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్త మవుతోంది. ఇదిలా ఉండగా వేములవాడ శ్రీరాజ రాజేశ్వరస్వామి ఆలయంలో రెండో రోజు శుక్రవా రం కూడా ఏసీబీ అధికారుల తనిఖీలు కొనసా గాయి. ఆలయంలోని వివిధ విభాగాలపై ఫిర్యా దులు రావడంతో గురువారం నుంచి తనిఖీలు చేస్తున్నారు. శుక్రవారం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో అధికారులు స్వామి వారి అన్నదానం, అకౌంట్స్‌ విభాగాల్లోని రికార్డులు పరిశీలించారు. రికార్డుల పరిశీలన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు డీఎస్పీ తెలిపారు. 

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు