Breaking News

జడ్జి గుర్తింపు కార్డు లాక్కున్నారు

Published on Fri, 10/18/2024 - 04:32

నేలకొండపల్లి: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని పైనంపల్లి టోల్‌గేట్‌ సిబ్బంది.. ఓ న్యాయమూర్తి కుటుంబం వెళ్తున్న కారుకు టోల్‌ ఫీజు చెల్లించినా జడ్జి గుర్తింపు కార్డు లాక్కోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. గురువారం ఓ జిల్లా జడ్జి కుటుంబ సభ్యులు కారులో ఖమ్మం వస్తున్నారు. ఈ క్రమంలో పైనంపల్లి టోల్‌గేట్‌ వద్ద డ్రైవర్‌.. న్యాయమూర్తి కారు అని చెప్పినా వినకుండా రుసుము చెల్లించాలని సిబ్బంది వాదనకు దిగారు. 

దీంతో డ్రైవర్‌ రుసుము చెల్లించారు. ఆపై న్యాయమూర్తికి చెందిన గుర్తింపు కార్డు చూపించగా.. సిబ్బంది దానిని లాక్కుని ఒరిజినల్‌ కార్డా, కాదా? అని తెలుసుకుని తర్వాత పంపిస్తామని దురుసుగా బదులిచ్చారు. ఈ విషయం తెలియడంతో ఆ న్యాయ మూర్తి టోల్‌గేట్‌ వద్దకు వచ్చి సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. 

సూర్యాపేట జిల్లాలోని ఓ పోలీస్‌స్టేషన్‌తో పాటు నేలకొండపల్లి పోలీసులు సైతం వచ్చి రుసుము చెల్లించినా న్యాయమూర్తి ఐడీ కార్డు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం టోల్‌గేట్‌ సిబ్బంది నుంచి కార్డు తిరిగి తీసుకున్నారు. ఈ ఘటనపై టోల్‌గేట్‌ సిబ్బంది మాట్లాడుతూ, చాలామంది నకిలీ కార్డులతో వస్తుండటంతో అనుమానం వచ్చి అడిగామని చెప్పడం గమనార్హం. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)