Breaking News

మైనర్‌కు బండి.. ‘మేజర్‌’ మిస్టేక్‌

Published on Thu, 04/27/2023 - 08:48

ఫ్రెండు వాళ్లింటికెళ్లొస్తానని.. కూరగాయలు తీసుకొస్తానని అడిగినా.. లేదా మీరే మరేదో పని అప్పజెప్పి పిల్లలకు వాహనాలిస్తున్నారా? అయితే జాగ్రత్త.. మీరూ ఊచల్లెక్కపెడతారు. వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులు ట్రాఫిక్‌ నిబంధనల్ని పక్కాగా అమలు చేస్తున్నారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే ఏ1గా వాహన యజమానిని, ఏ2గా పట్టుబడిన మైనర్‌ను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు.

పిల్లల సంతోషం, సరదా కోసం వాహనాలిస్తున్న తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పవు. మైనర్లు వాహనాలు నడుపుతూ రోడ్డెక్కితే వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులు కేసులు నమోదు చేసి జువైనల్‌ హోమ్‌కు తరలిస్తున్నారు. ఈడాది జనవరి 1 నుంచి ఇప్పటి వరకు సుమారు 144 మంది మైనర్లపై కేసులు నమోదు చేశారు. అందులో 91 మందిని ఇప్పటికే అరెస్ట్‌ చేసి జువైనల్‌ హోమ్‌కు తరలించారు. మరో 53 మందిని అరెస్ట్‌ చేసి జువైనల్‌ హోమ్‌కు తరలించే పనిలో పోలీసులు ఉన్నారు. రోడ్డు ప్రమాదాల్లో 20 శాతం ప్రమాదాలు మైనర్లు వాహనాలు స్పీడ్‌గా, అజాగ్రత్తగా నడపడం కారణంగా జరిగినట్లు పోలీసు అధికారుల సమీక్షలో తేటతెల్ల మైంది. వేసవి సెలవుల్లో మైనర్లు వాహనాలు నేర్చుకోవాలని, పూర్తిగా నేర్చుకోకముందే రోడ్డె్డక్కి రైడింగ్‌ చేయాలనే ఆలోచనతో తల్లిదండ్రులపై ఒత్తిడి తేచ్చే అవకాశం ఉంది. కానీ పిల్లల ఒత్తిడికి లోనై వాహనాలను వారి చేతికిస్తే వారి భవిష్యత్‌ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో జరిగిన పలు రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారిలో మైనర్లు ఎక్కువ మంది ఉండడం దురదృష్టకరం. ప్రమాదంలో గాయపడిన ఇతరులకు కూడా తీవ్ర నష్టం కలుగుతుంది. ప్రమాదాల కారణంగా పలు కుటుంబాల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. 

లైసెన్స్‌ లేకుండా రోడ్డెక్కితే ప్రమాదమే..
వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా రోడ్డెక్కిన మైనర్లు హనుమకొండ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈఏడాది 43 మంది పట్టుబడ్డారు. వరంగల్‌లో 69 మంది పట్టుబడగా.. కాజీపేటలో 32 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇందులో 91 మందిని అరెస్ట్‌ చేసి జువైనల్‌ హోమ్‌కు తరలించారు. మరో 53 మంది అరెస్ట్‌ కావాల్సి ఉంది. దీంతో పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా రోడ్డెక్కిన 1,755 మందికి రూ.1,25,02,700 జరిమానా విధించారు. గతేడాది కమిషనరేట్‌ పరిధిలో నమోదైన మైనర్‌ డ్రైవింగ్‌ కేసులు హనుమకొండ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 209 కేసులు నమోదు కాగా.. రూ.1,04,500 జరిమానా విధించారు. వరంగల్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 280 కేసులకు రూ.1,40,000, కాజీపేట ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 305 కేసులకు రూ.1,52,500 జరిమానా విధించారు. మొత్తం 794 కేసులు నమోదు కాగా.. వాటికి రూ. 3,97,000 జరిమానా విధించారు.

పిల్లలు అడిగినా వాహనాలివ్వొద్దు..
పిల్లలపై తల్లిదండ్రులకు ఉన్న అమితమైన ప్రేమ కారణంగా పిల్లలు అడిగిన వెంటనే తల్లిదండ్రులు వారికి బండ్లు ఇస్తున్నారు. దీని వల్ల వారు తెలిసీ తెలియని వయసులో ఎమోషన్స్‌తో స్పీడ్‌ను థ్రిల్‌గా భావించి ప్రమాదాలకు కారణమై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మైనర్లకు వాహనాలిచి్చన తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తాం. వాహనాల ఓనర్‌ ఏ1గా ఉంటే.. మైనర్‌ ఏ2గా ఉంటాడు. వేసవి సెలవుల్లో ట్రాఫిక్‌ పోలీసులు అడుగడుగునా వాహనాలు తనిఖీలు చేస్తారు. పట్టుపడితే శిక్ష తప్పదు.
– ఏవీ.రంగనాథ్, సీపీ
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)