Breaking News

కమీషన్‌ కోసమే ప్రాణహితను కాళేశ్వరంగా మార్పు: మంత్రి ఉత్తమ్‌

Published on Sat, 07/20/2024 - 18:11

సాక్షి, ఢిల్లీ: బీఆర్‌ఎస్‌ హయాంలో ఎక్కువ కమీషన్‌ కోసమే రీ-డిజైన్‌ పేరుతో ప్రాణహిత ప్రాజెక్ట్‌ను కాళేశ్వరం ప్రాజెక్ట్‌గా మార్చారని ఆరోపించారు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. రాష్ట్ర ప్రజల లక్ష కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని కామెంట్స్‌ చేశారు.

కాగా, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ శనివారం నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌, అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దెబ్బతిన్న మేడిగడ్డ బ్యారేజ్‌ మరమ్మత్తులు, తదితర అంశాలపై చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పరిస్థితిపై కూడా చర్చించారు. మేడిగడ్డ బ్యారేజీ మరమ్మత్తులు తదితర అంశాలపై చర్చించారు. ఇక, ఈ చర్చ అనంతరం మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీలో మంత్రి ఉత్తమ్‌ మాట్లాడుతూ..‘నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధారిటీ అధికారులతో రెండున్నర గంటల పాటు సమావేశం జరిగింది. సోమవారం ఇంజనీర్ల స్థాయిలో మరోసారి సమావేశం జరుగుతుంది. ఎక్కువ కమీషన్ కోసం రీ-డిజైన్ పేరుతో ప్రాణహిత ప్రాజెక్ట్‌ను కాళేశ్వరం ప్రాజెక్ట్‌గా మార్చింది గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజక్టు మార్చడం తప్పు.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కోసం ఎక్కువ వడ్డీలకు అప్పులు తెచ్చారు. ఏడాదికి తొమ్మిది వేల కోట్లు తెలంగాణ ప్రజల డబ్బును వడ్డీ రూపంలో కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.  లక్ష కోట్ల రూపాయల ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశారు.  కాళేశ్వరం కింద అరకొరగా సాగు మాత్రమే అవుతోంది. బీఆర్‌ఎస్‌ హయాంలోనే కాళేశ్వరం ఆరు అడుగుల లోతుకు ప్రాజెక్ట్‌ కుంగిపోయింది.

మేడిగడ్డ పునాది బలపరిచేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. మేడిగడ్డ ప్రాజెక్టుకు రిపేర్లు చేస్తున్నాం. కాళేశ్వరం బ్యారేజ్‌ గేట్లు ఎత్తి నీటిని కిందకి వదలాలని డ్యాం సేఫ్టీ అథారిటీ సూచన చేసింది. మేడిగడ్డ వద్ద మట్టి పరీక్షలు సాధ్యపడలేదు. తుమ్మిడిహట్టి వద్ద కొత్త ప్రాజెక్టు కడతాం.  గ్రావిటీ ద్వారా నీటిని తరలించేలా ప్రణాళికలు చేస్తున్నాం.  మా  ప్రభుత్వంలో ఈ నిర్మాణం పూర్తి చేస్తాం.  పెద్దవాగు ప్రాజెక్టు అంతరాష్ట్ర ప్రాజెక్టు. దాని ఆయకట్టంతా ఏపీలోనే ఉంది. దానికి మమ్మల్ని బాధ్యులను చేయడం సరికాదు’ అంటూ కామెం‍ట్స్‌ చేశారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)