Breaking News

ఎకరం కూడా ఎండిపోరాదు

Published on Sun, 03/09/2025 - 00:23

నల్లగొండ: నీరందక ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు స్పష్టం చేశారు. వేసవిలో సాగు, తాగునీరు సమస్యలు ఉత్పన్నం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై శనివారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌లో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ఉమ్మడి నల్లగొండ జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కాల్వల కింద పలుచోట్ల నీరు అందక వరి పొలాలు ఎండిపోతున్నాయని పలువురు ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తెచ్చారు. కాల్వల్లో మోటార్లు వేసి కొందరు రైతులు కిలోమీటర్ల కొద్దీ తీసుకుపోతుండటం వల్ల.. కాల్వ చివరి రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. దీనిపై మంత్రి తుమ్మల స్పందిస్తూ.. అధికారులు అలాంటి వాటికి అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

క్షేత్ర స్థాయికి అధికారులు వెళ్తే.. సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. వేసవిలో తాగునీటి తక్షణ సమస్య పరిష్కారానికి.. కలెక్టర్‌ల వద్ద కొంత నిధులు ఉంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యేలకు నిధులు మంజూరు చేసే విషయమై.. ముఖ్యమంత్రితో మాట్లాడతానని హామీ ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి పంచాయతీలో నిధులు అందుబాటులో ఉంచితే.. ఎక్కడ తాగునీటి సమస్య ఏర్పడినా వెంటనే పరిష్కరించవచ్చని సూచించారు. శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాల్వల విస్తరణతో పాటు లైనింగ్‌ పనులు చేస్తేనే చివరి భూములకు నీరందించగలుగుతామని అభిప్రాయపడ్డారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)