వాణిజ్య పంటలవైపు రైతులను ప్రోత్సహించాలి

Published on Sun, 11/03/2024 - 04:28

సాక్షి, హైదరాబాద్‌: వాణిజ్య పంటల సాగువైపు రైతాం గాన్ని ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. ప్రధా నంగా పంటల మార్పిడిపైన విస్తృత అవగాహన కల్పించాలని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా నియమితులైన వ్యవసాయ అధికారులకు శనివారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, రానున్న ఐదేళ్లలో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా ని లబెట్టాలనే సంకల్పంతో ప్రభుత్వం వ్యూహాత్మకంగా పనిచేస్తోం దని అన్నా­రు. ప్రభుత్వ సంకల్పంలో వ్యవసాయాధికారులంతా భాగస్వా­మ్యం కావాలన్నారు. సాంకేతికంగా వస్తున్న మార్పుల ను, పద్ధతులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అప్‌డేట్‌ కావా ల­న్నారు. 

నూతన విషయాలు తెలుసుకునే విధంగా వ్యవసాయ శాఖ అధికారులకు క్రమం తప్పకుండా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌ రావును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సంచాలకుడు గోపి, కోర్సు కోఆర్డినేటర్‌ ఉషారాణి, ఎంసీఆర్‌­హెచ్‌ఆర్‌డీ డీజీ శశాంక్‌ గోయల్‌ తదితరులు పాల్గొన్నారు. కొత్తగా నియమితులైన అధికారులు ముఖ్యమంత్రి సహాయనిధి కోసం రూ.51 వేల చెక్కును మంత్రి తుమ్మలకు అందచేశారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)