Breaking News

రైతులకు అలర్ట్‌.. వారికి రుణమాఫీ కాదు: మంత్రి తుమ్మల

Published on Sat, 07/20/2024 - 16:34

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రుణమాఫీపై రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. ఒక్క కుటుంబంలో నాలుగు ఖాతాలు ఉంటే నాలుగు అకౌంట్స్‌కు రుణమాఫీ జరుగుతుందని కామెంట్స్‌ చేశారు.

కాగా, మంత్రి తుమ్మల శనివారం సచివాలయంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆనాడు దివంగత వైఎస్సార్‌ ప్రభుత్వంలో రుణమాఫీ జరిగింది. సీఎం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంలో కూడా రుణమాఫీ జరుగుతోంది. ఆధార్‌, బ్యాంక్‌ అకౌంట్‌, ఆర్‌బీఐ తప్పిదాల వల్ల రుణమాఫీ రిజెక్ట్‌ అయితే 24 గంటల్లోనే వివరణ ఇస్తారు. రైతులు ఆందోళన చెందకండి. పాత పద్దతిలోనే రుణమాఫీ అమలు జరుగుతుంది.

సాంకేతిక అంశాల కారణంగా ఇబ్బంది కలిగితే ప్రతీ బ్యాంక్‌ వద్ద అధికారులు అందుబాటులో ఉంటారు. ఒక్క కుటుంబంలో నాలుగు ఖాతాలు ఉంటే నాలుగు ఖాతాల్లో రుణమాఫీ జరగుతుంది. రుణమాఫీపై కొంత మంది కావాలనే రాజకీయం చేస్తున్నారు. వారి వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. 

రుణమాఫీ మొత్తం సెప్టెంబర్ నెల పూర్తి అయ్యేలోపు రైతుల ఖాతాలోకి జమ అవుతాయి. మూడు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఆధార్ సాంకేతిక సమస్య ఉంది. ఇన్‌కమ్‌ ట్యాక్స్ కట్టే బడాబాబులు, ప్రజాప్రతినిధులకు రుణమాఫీ కాదు. ఒకేరోజు 500 ఖాతాల్లో రుణం డబ్బులు జమ అయ్యాయి. వాటిపై విచారణ జరుగుతుంది. ఐదారు కోపరేటివ్ సొసైటీ బ్యాంకుల రుణాలపై అనుమానాలు ఉన్నాయి. అవి రెండు వేల ఖాతాలు ఉన్నాయి. 44లక్షల రైతుల ఖాతాలు, 25లక్షల కుటుంబాలు ఉన్నాయి. వీరందరికీ రుణమాఫీ జరుగుతుంది’ అని హామీ ఇచ్చారు. 

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)