Breaking News

‘టీం శివంగి’

Published on Sun, 04/20/2025 - 03:28

నిర్మల్‌టౌన్‌: వివిధ రంగాల్లో మహిళా శక్తి భాగస్వామ్యం వేగంగా పెరుగుతున్నా.. కొన్ని కష్టతరమైన రంగాల్లో ఇప్పటికీ తక్కువగానే ఉన్నది. ముఖ్యంగా భద్రతా దళాలు, పోలీస్‌ విభాగాల్లో పురుషాధిక్యమే కొనసాగుతోంది. ఈ పరిస్థితిని మార్చే పనికి నిర్మల్‌ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల పునాది వేశారు. త్రివిధ దళాల తరహాలో జిల్లాలో మహిళా కమాండోస్‌ను తయారు చేశారు. పురుషులకు దీటుగా మహిళా కానిస్టేబుళ్లకు కఠోర శిక్షణ ఇచ్చి మెరికల్లా తయారుచేశారు. వారికి ‘టీం శివంగి’గా నామకరణం చేశారు. 

45 రోజుల శిక్షణ
టీం శివంగి కానిస్టేబుళ్లకు 45 రోజులపాటు కఠోర శిక్షణ ఇచ్చారు. శారీరక దృఢత్వం, పరుగు పందేలు, వెరైటికల్‌ రోప్‌ క్లైంబింగ్, మనుగడ పద్ధతులు, పోరాట నైపుణ్యాలు, పేలుడు పదార్థాల నిర్వహణలో శిక్షణ, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆయుధాల వినియోగం, వెపన్‌ హ్యాండ్లింగ్, ఫీల్డ్‌ సిగ్నల్స్, మ్యాప్‌ రీడింగ్, మ్యాప్‌ లేకుండా నావిగేట్‌ చేయడం, ఆకస్మిక వ్యూహాలు, శత్రువుల కదలికలు, అడవి సంకేతాలను చదవడం, నిఘా పద్ధతులు, ఆకస్మిక దాడి, ఎదురుదాడి కసరత్తులు, రహస్య స్థావరాలపై దాడులు చేయడం లాంటివి ఈ శిక్షణలో నేర్పించారు. ఈ శిక్షణ పొందినవారికి ఆయా విభాగాల్లో స్పెషల్‌ టీంలుగా నియమిస్తున్నారు.

మంత్రి చేతుల మీదుగా ప్రారంభం
శనివారం జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సీతక్క టీం శివంగిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఎస్పీ జానకీ షర్మిల చేస్తున్న కృషిని అభినందించారు. మామడ చిట్టడవిలో తప్పిపోయిన నలుగురు మహిళలను వెతికి పట్టుకోవడంలో ఎస్పీ, సిబ్బంది పడ్డ కష్టాన్ని కొనియాడారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఇలాగే శివంగి టీంలు ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వాలని సూచించారు. శిక్షణలో కష్టంతో కాకుండా ఇష్టంగా నేర్చుకోవాలని తెలిపారు.

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)