Breaking News

‘చెలిమి’కి అంకురం..

Published on Thu, 08/17/2023 - 01:39

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర విద్యా వ్యవస్థలో శాస్త్రీయతను జోడిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వివిధ రూపాల్లో విద్యార్థులకు ఎదురయ్యే ఒత్తిడులను తట్టుకునేలా ‘చెలిమి’ విద్యార్థుల్లో వ్యాపార దృక్పథాన్ని పెంచడంతో పాటు, వ్యవస్థాపక ఆలోచనలను పెంపొందించేందుకు ‘అంకురం’అనే కార్యక్రమాలను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. బుధవారం రంగారెడ్డి జిల్లాలోని శివరాంపల్లి ఉన్నత పాఠశాలలో చెలిమి, అంకురం కార్యక్రమాలను ఆమె లాంఛనంగా ప్రారంభించారు.

చెలిమి కార్యక్రమం ద్వారా సమస్యలను పరిష్కరించే వినూత్న ఆలోచన శక్తిని పెంపొందించేలా కృషి చేస్తామన్నారు. పిల్లలు తమ నిజ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా, వేగంగా పురోగమిస్తున్న ప్రపంచానికి అనుగుణంగా తమను తాము సమాయత్తం చేసుకొనేలా తరగతి గదిలో సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. విద్యార్థుల్లోని అభిరుచులను తెలుసుకునే ప్రయత్నం చేయడంతో పాటు ఏయే రంగాల్లో రాణిస్తారనే విషయాన్ని తెలుసుకునేందుకు శాస్త్రీయ మదింపు చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతి జిల్లాలో ఒక్కో ఉన్నత పాఠశాలను ఎంపిక చేసి చెలిమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అంకురం కార్యక్రమాన్ని పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా 8 జిల్లాల్లో 35 కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లలో 11వ తరగతి విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తున్నామని చెప్పారు.

మంచి భవిష్యత్‌ను అందించేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్‌ బి.వినోద్‌కుమార్‌ అన్నారు. కార్యక్రమంలో శాసన సభ్యుడు ప్రకాశ్‌ గౌడ్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా సంచాలకురాలు దేవసేన తదితరులు పాల్గొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)