Breaking News

తడిసిన ధాన్యం కొంటాం.. 

Published on Tue, 05/02/2023 - 03:15

సాక్షి, హైదరాబాద్‌: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. ఇందులో భాగంగా వానకు తడిసిన ధాన్యంతో బాయిల్డ్‌ రైస్‌ తయారు చేయడానికి ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వేసవి కాలంలో కురుస్తున్న భారీ వర్షాలతో ధాన్యం తడిసిపోతోందని, దీనితో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు 1.28 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని అత్యవసరంగా బాయిల్డ్‌ రైస్‌ చేయడానికి ఉత్తర్వులు జారీ చేశామని, ధాన్యం సేకరణలో మరింత వేగం పెంచుతామని స్పష్టం చేశారు.

సోమవారం మంత్రి సచివాలయంలో పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాలతో అత్యధికంగా నష్టపోయిన నల్లగొండ జిల్లాలో 22 వేల మెట్రిక్‌ టన్నులు, కామారెడ్డి, సిద్దిపేట, పెద్దపల్లి, సూర్యాపేట, కొత్తగూడెం జిల్లాల్లో 14,706 మెట్రిక్‌ టన్నులు, నిజమాబాద్‌లో 14,700, కరీంనగర్‌లో 7,350, యాదాద్రి, జగిత్యాలలో 5,000 మెట్రిక్‌ టన్నుల చొప్పున బాయిల్డ్‌ రైస్‌ కోసం ధాన్యం సేకరణకు ఉత్తర్వులు జారీ చేశామని మంత్రి గంగుల వెల్లడించారు. ఇప్పటివరకు గత యాసంగి కన్నా రెండున్నర రెట్లు అధికంగా ధాన్యం సేకరణ చేశామని వివరించారు.

గతేడాది ఇదే రోజునాటికి 3.23 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే సేకరించగా.. ఈ సారి 7.51 లక్షల మెట్రిక్‌ టన్నులను సేకరించామన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ధాన్యం కొనుగోళ్లు చురుగ్గా చేస్తున్నామన్న మంత్రి, రోజుకు 80 వేల మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యం సేకరిస్తున్నామన్నారు. ఇప్పటివరకూ 5,000 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 40 వేల మంది రైతుల నుంచి 7.51 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించామని, వీటి విలువ రూ.1,543 కోట్లని తెలిపారు. నిధులకు ఎలాంటి కొరత లేదని స్పష్టంచేశారు. ఈ సమీక్షలో పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ వి.అనిల్‌ కుమార్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)