కండక్టర్ల ఎంపికలో మంత్రిగారి కోటా!

Published on Sat, 07/11/2026 - 05:14

సాక్షి, హైదరాబాద్‌: తాత్కాలిక కండక్టర్ల నియామకంలో ఓ మంత్రిగారి ఒత్తిడి ఆర్టీసీలో అలజడి సృష్టిస్తోంది.. తాను చెప్పిన వారినే ఎంపిక చేయాలని ఆ మంత్రి నుంచి వస్తున్న ఒత్తిడి, అప్పటికే ఎంపిక చేసుకున్నందున తమ అభ్యర్థులకే ఇవ్వాలని కాంట్రాక్టర్లు పట్టుపట్టడంతో 3 నెలలుగా మెదక్‌ జిల్లాలో మొత్తం నియామకాలు నిలిపేశారు. ఫలితంగా కండక్టర్ల కొరత కొనసాగుతూ నిత్యం వంద వరకు బస్సులు డిపోలకు పరిమితం కావాల్సి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఎంపిక తంతుకు వ్యతిరేకంగా మంత్రిగారి కార్యాలయం ఒత్తిడి చేయడం ఆర్టీసీ అధికారులను బెంబేలెత్తిస్తోంది. రిటైర్మెంట్లతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీలో కండక్టర్ల సంఖ్య తగ్గి కొన్ని బస్సులను నడపలేని పరిస్థితి ఏర్పడింది.

రెగ్యులర్‌ కండక్టర్ల నియామక ప్రక్రియ మొదలు కాకపోవటంతో, తాత్కాలిక పద్ధతిలో ఔట్‌సోర్సింగ్‌ కండక్టర్లను నియమించుకునేందుకు ప్రభుత్వం ఆర్టీసీకి అనుమతించింది. కండక్టర్ల, కొరత ఉన్న డిపోలలో ఈ ప్రక్రియ చేపట్టేందుకు ఆర్టీసీ రీజియన్ల అధికారులకు గత ఏప్రిల్‌లో ఆదేశాలు వెలువడ్డాయి. సమస్య తీవ్రత దృష్ట్యా దాదాపుగా అన్నిచోట్లా వెంటనే నియామక ప్రక్రియ పూర్తి చేశారు. కానీ మెదక్‌ జిల్లాలో మాత్రం ఆ ప్రక్రియ అసలు మొదలే కాలేదు. 

జిల్లాలోని 8 డిపోలకు గాను, కొరత ఉన్న ఆరు డిపోల్లో 80 మంది ఔట్‌ సోర్సింగ్‌ కండక్టర్ల ఎంపిక జరగాల్సి ఉండగా, ఒకేరోజు అన్ని డిపోల్లో ఆ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. డిపోల్లో ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని సరఫరా చేసిన కాంట్రాక్టర్లకే ఈ బాధ్యత అప్పగించాలనే ఆదేశాలున్నాయి. డిపోల్లో ఒకరికి మించి కాంట్రాక్టర్లు ఉంటే లాటరీ పద్ధతిలో ఒకరిని ఎంపిక చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. మెదక్‌ జిల్లాలోని డిపోలకు కూడా ఇలాగే జరిపేందుకు కాంట్రాక్టర్లను ఎంపిక చేశారు. కాంట్రాక్టర్లు తదనుగుణంగా అభ్యర్థుల జాబితా సిద్ధం చేశారు. వారి నుంచి డిపాజిట్‌ రూపంలో కొంతమొత్తాన్ని కూడా వసూలు చేశారు. ఆ జాబితాను అధికారులకు అందజేసి ఇంటర్వ్యూలకు అంతా సిద్ధం చేసిన తరుణంలో, ఓ మంత్రి గారు ఎంటర్‌ అయ్యారు. 

మంత్రిగారు సూచించారంటూ ఆయన పేషీ అధికారులు గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక డిపోలకు సంబంధించి 38 మందితో కూడిన ఓ జాబితాను రీజియన్‌ అధికారులకు పంపారు. ఆయా అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిచి ఎంపిక చేయాలని ఆదేశించారు. అయితే అప్పటికే కాంట్రాక్టర్లు అధికారికంగా జాబితాను అందజేశారని అధికారులు పేర్కొనగా, మంత్రి గారి జాబితా ప్రకారమే ఎంపికలు జరపాలని తేల్చి చెప్పారు. దీనికి కాంట్రాక్టర్లు ససేమిరా అన్నారు. తాము ‘అన్నీ మాట్లాడుకుని’అభ్యర్థులను ఎంపిక చేశామని, ఇప్పుడు కాదంటే ఎలా అంటూ పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో ఎటూ తేల్చుకోలేని అధికారులు ఏకంగా ఎంపిక ప్రక్రియనే తాత్కాలికంగా వాయిదా వేశారు.  

డిపోల్లోనే కొన్ని బస్సులు.. 
    ఏప్రిల్‌లో ఔట్‌సోర్సింగ్‌ కండక్టర్ల నియామకానికి అనుమతి వచి్చనా, ప్రస్తుత పరిస్థితుల్లో పెండింగ్‌లో పడటంతో ఆ జిల్లా డిపోల్లో కండక్టర్ల కొరత కొనసాగుతూనే ఉంది. కండక్టర్లు సరిపోక డిపోల్లో నిత్యం కొన్ని బస్సులు నిలిచిపోవాల్సి వస్తోంది. ఫలితంగా కొన్ని గ్రామాలకు బస్సు సర్వీసులు నడపకపోవడంతో ఆయా ప్రాంతాల ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు.  

’12 మంది’ఫార్ములా ఫెయిల్‌.. 
    ఈ పరిస్థితుల్లో వివాదాన్ని ఎలాగైనా ముగించాలని అధికారులు ప్రయతి్నంచారు. కాంట్రాక్టర్లపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. మధ్యేమార్గంగా మంత్రి పంపిన జాబితా నుంచి 12 మందిని, మిగిలినవి తాము ఎంపిక చేసిన వారితో భర్తీ చేసేందుకు కాంట్రాక్టర్లు అంగీకరించారు. దీంతో రెండురోజుల క్రితం ఆ మూడు డిపోలకు సంబం«ధించి మంత్రి జాబితా నుంచి 12 మందిని పిలిచి ఇంటర్వ్యూ పూర్తి చేశారు. అర్హతల మేరకు ఒకరు తప్ప మిగతావారంతా ఎంపికయ్యారు.

కానీ తమ జాబితా నుంచి కేవలం 12 మందినే ఇంటర్వ్యూకు పిలిచారన్న విషయం తెలిసి మంత్రి పేషీ భగ్గుమంది. మితావారిని కూడా ఎంపిక చేయాల్సిందేనని మరోసారి అల్టీమేటం ఇవ్వటంతో అధికారులకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. స్వయంగా మంత్రి పేషీ నుంచే కాంట్రాక్టర్లకు ఫోన్‌ చేసి ఒత్తిడి తెచి్చ, మంత్రి జాబితాలోని మిగతా వారిని కూడా ఇంటర్వ్యూకు రావాలని పురమాయించడం విశేషం.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)