మంత్రి పువ్వాడ సీరియస్‌.. డబ్బు వాపస్‌ చేసిన ప్రైవేట్‌ ఆస్పత్రి

Published on Wed, 06/30/2021 - 16:43

సాక్షి, ఖమ్మం: కరోనా చికిత్స పేరిట పలు ప్రైవేట్ ఆసుపత్రులు అధిక బిల్లులు వసూలు చేస్తున్నాయి. కొవిడ్ రోగుల భయాలను ఆసరా చేసుకుని ఇష్టానుసారంగా లక్షల్లో ఫీజులు గుంజుతున్నాయి. ఇటీవలే  కోవిడ్ బారిన పడి మృతి చెందిన ఓ వ్యక్తి కుటుంబం నుంచి అధిక బిల్లులను వసూళ్లు చేసిన ఓ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యంపై  మంత్రి పువ్వాడ అజయ్‌ కూమార్‌  సీరియస్‌ అయ్యారు. మంత్రి ఆదేశాలతో బాధిత కుటుంబం కట్టిన  5 లక్షల అధిక బిల్లులను ఆసుపత్రి యాజమాన్యం తిరిగి చెల్లించింది.

వివరాలు.. ఖమ్మం పట్టణానికి చెందిన అలీమ్ కొద్ది రోజుల క్రితం కోవిడ్‌ బారినపడ్డారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఎల్బీ నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కుటంబ సభ్యులు చేర్పించారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించటంతో అలీమ్ ఆసుపత్రిలో మృతి చెందాడు. ఆయన కుటుంబం నుంచి సదరు ఆస్పత్రి యాజమాన్యం చార్జీల రూపంలో 6 లక్షల 40 వేలు వసూలు చేసింది.

అయితే ఈ విషయాన్ని మంత్రి పువ్వాడ  దృష్టికి  మృతుని కుటుంబ  సభ్యులు తీసుకు వెళ్లడంతో ఆసుపత్రి యాజమాన్యంపై ఆయన మం‍డిపడ్డారు. అధికంగా వసూలు చేసిన బిల్లులను వెనక్కి చెల్లించాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో  5 లక్షల రూపాయలను బాధిత కుటుంబానికి  ఆసుపత్రి యాజమాన్యం చెల్లించింది.
చదవండి: Khammam: మధిర ఎస్సీ కాలనీలో దారుణం.. భర్త చేత భార్య పన్ను పీకించి


 

Videos

మహేష్ బాబు గురించి చెప్పిన శ్రీమంతుడు నటి

18వ ఆటా మహాసభల్లో మెహ్రీన్ సందడి

ప్రధాని మోదీ సరికొత్త రికార్డు..

టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ కు షాక్ ఇచ్చిన భారత్

పోలీసుల అండతో ఏపీ వ్యాప్తంగా టీడీపీ విద్వాంసఖండ

అట్లాంటాలో తెలుగువారిని చూసి శ్రీకాంత్ సంతోషం

బాయ్ ఫ్రెండ్ కోసం వెతుకుతున్న జబర్దస్త్ ఐశ్వర్య

అట్లాంటాలో ఘనంగా ఆటా బాంక్వెట్ వేడుకలు

ఎన్నికల ఫలితాలపై జగ్గిరెడ్డి రియాక్షన్

నా విజయానికి కారణం జగనన్నే..

Photos

+5

Premgi Amaren: 45 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న కమెడియన్‌ (ఫోటోలు)

+5

పాక్‌లో ప్రముఖ ఆలయాలు (ఫొటోలు)

+5

కల నెరవేరుతున్న వేళ.. పట్టలేనంత సంతోషంలో బిగ్‌బాస్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

అర్జున్‌ సర్జా కూతురి పెళ్లి.. గ్రాండ్‌గా హల్దీ సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

Fish Prasadam 2024 : చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు (ఫొటోలు)

+5

మృగశిర కార్తె ఎఫెక్ట్ : కిక్కిరిసిన రాంనగర్ చేపల మార్కెట్‌ (ఫొటోలు)

+5

Mayank Agarwal : కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టీమిండియా క్రికెటర్ ‘మయాంక్ అగర్వాల్’ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు (ఫొటోలు)

+5

ఈ హీరోయిన్‌ మనసు బంగారం.. మీరు కూడా ఒప్పుకోవాల్సిందే! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో గోవా బీచ్‌లో చిల్‌ అవుతున్న యాంకర్‌ లాస్య (ఫోటోలు)