Breaking News

రంగారెడ్డిలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల స్వాధీనం

Published on Wed, 03/19/2025 - 05:05

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లాలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములపై విచారణ జరిపించి స్వాదీనం చేసుకుంటామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కొంగరకలాన్‌లో సర్వే నెం.300లోని 95 ఎకరాల భూమిని గత ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసిందని, దీని విలువ రూ.2 వేల కోట్లు ఉంటుందని కాంగ్రెస్‌ సభ్యుడు మల్‌రెడ్డి రంగారెడ్డి మంగళవారం శాసనసభ జీరో అవర్‌లో ఆరోపించగా, మంత్రి పొంగులేటి ఈ మేరకు బదులిచ్చారు. చెరువులను మట్టితో పూడ్చితే విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నారు. 

⇒ గిరిజనులు అధికంగా ఉండే ప్రాంతాలకు అదనంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని పొంగులేటి తెలిపారు. తిరుమలగిరి మండలంలోని 18 గ్రామాలను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తున్నామన్నారు.  

⇒ ఆరోగ్యశ్రీ పథకం పెండింగ్‌ బిల్లులను ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఈనెల 17 నుంచి ఆస్పత్రులు నగదు రహిత చికిత్సలను నిలిపేశాయని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు తెలిపారు.  

⇒ మధ్యాహ్న భోజనం పథకం కింద విద్యార్థులకు మళ్లీ గుడ్లనే ఇవ్వాలని ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సూచించారు.  

⇒ ఉస్మానియా వర్సిటీలో ఆందోళనలు, నిరసనలపై నిషేధం విధిస్తూ ఇచ్చిన జీవోను ఉపసంహరించుకోవాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని కోరారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఆందోళనలు, నిరసనలు తెలుపుతున్న వారిని అరెస్టు చేయడం తగదన్నారు.  

⇒ తనను శాసనసభ నుంచి వెలివేస్తానని సీఎం రేవంత్‌ పదేపదే అంటున్నారని, తన నియోజకవర్గంలోని ఏ ఒక్క గ్రామంలోనైనా 100 శాతం రుణమాఫీ జరిగితే తానే రాజీనామా చేస్తానని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సవాలు విసిరారు.  
⇒ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎండిపోయిన పంటలకు పరిహారం చెల్లింపుపై కూనంనేని సాంబశివరావు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్టు స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ ప్రకటించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)