Breaking News

జంతు దాడుల పరిహారం రూ. 20 లక్షలకు పెంపుపై కసరత్తు

Published on Sat, 11/23/2024 - 06:09

సాక్షి, హైదరాబాద్‌: వన్యప్రాణుల దాడుల ఘటనల్లో మరణించిన వారికి ఇచ్చే నష్టపరిహారాన్ని రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిహారాన్ని రూ. 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. శుక్రవారం కొండా సురేఖ అధ్యక్షతన అమ్రాబాద్, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ గవరి్నంగ్‌ బాడీస్‌ సమావేశం జరిగింది.

ఈ భేటీలో సురేఖ మాట్లాడుతూ ఆమ్రాబాద్, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ల పరిధిలోని గ్రామాల తరలింపు ప్రక్రియ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్నందున వారిలో విశ్వాసాన్ని కల్పిస్తూ పునరావాస ప్రక్రియను చేపట్టాలని అధికారులకు సూచించారు. పునరావాసం కోసం తరలించిన కుటుంబాలకు శాశ్వత పట్టాలు అందించాలని, రాకపోకల నిమిత్తం గ్రీన్‌ పాసులు అందించాలని, స్కూల్‌ ఏర్పాటు చేయాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు మంత్రిని కోరారు. సాధారణ అటవీ ఉత్పత్తులను సేకరించే స్థానికులపై మానవత్వం చూపాలని మంత్రి అధికారులకు సూచించారు. 

అక్కమహాదేవి గుహలు, సలేశ్వరం జాతరకు సౌకర్యాలు  
దోమలపెంట–శ్రీశైలం ఎకో టూరిజం సర్క్యూట్‌లో భాగంగా అక్కమహాదేవి గుహలను సందర్శించే భక్తులకు యాత్రా సౌకర్యాల కల్పనకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను మంత్రి సురేఖ ఆదేశించారు. తెలంగాణ అమర్నాథ్‌ యాత్రగా ప్రసిద్ధిగాంచిన సలేశ్వరం జాతరను భవిష్యత్తులో చేపట్టనున్న సర్క్యూట్‌లలో చేర్చి ప్రభుత్వపరంగా యాత్రా సౌకర్యాలను కలి్పంచే దిశగా కార్యాచరణ చేపట్టాలన్నారు. ఈ భేటీలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే ఆర్‌. భూపతిరెడ్డి, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్‌ నదీమ్, పీసీసీఎఫ్‌ డోబ్రియాల్, పిసిసిఎఫ్‌ (వైల్డ్‌ లైఫ్‌) ఏలూసింగ్, డీసీసీఎఫ్‌ ఆంజనేయులు(హెడ్‌ ఆఫీస్‌), ఓఎస్డీ శంకరన్‌ పాల్గొన్నారు. 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)