Breaking News

సచివాలయానికి ఉద్యోగులు ఆలస్యంగా రావడమా?

Published on Thu, 07/04/2024 - 04:30

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి గుండెకాయలాంటి సచివాలయానికి కొంత మంది ఉద్యోగులు ఆలస్యంగా రావడం భావ్యం కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసహనం వ్యక్తంచేశారు. మీరే ఇలా వస్తే జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులకు మీరిచ్చే సందేశం ఏంటని ప్రశ్నించారు. బుధవారం సచివాలయంలో ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు రోడ్లు, భవనాల శాఖకు సంబంధించిన పేషీని, సెక్షన్లను మంత్రి తనిఖీ చేశారు. 

ఆ సమయంలో 50% ఉద్యోగులు కూడా ఆఫీసులకు రాకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. గత పదేళ్లుగా మంత్రులను, ముఖ్యమంత్రులను కలిసే అవకాశం లేక  ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని తెలిపారు. ప్రజలు మాకు ఎన్ని వినతులిచి్చనా, పరిష్కరించాల్సింది ఉద్యోగులేనని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంప్లాయ్‌ ఫ్రెండ్లీ ప్రభుత్వమని, సచివాలయానికి ఉద్యోగులు ఇంత ఆలస్యంగా రావడం భావ్యం కాదని హెచ్చరించారు. 

సమయానికి ఆఫీసుకు వచ్చిన ఉద్యోగు ల కుర్చీల వద్దకు వెళ్లి అభినందించిన మంత్రి.. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఒక రిద్దరు ఉద్యోగులు తమ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరి స్థితి బాగాలేద ని చెప్పగా.. వారితో కోమటిరెడ్డి మాట్లాడారు. మంత్రి తమ సెక్షన్‌కు రావడం మూలంగా సమస్యలు చెప్పుకునే అవకాశం దొరి కిందని ఉద్యోగులు ఆనందం వ్యక్తంచేశారు.   

Videos

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)