Breaking News

వితంతువుతో ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ

Published on Mon, 11/24/2025 - 07:28

కొల్లాపూర్‌: సాంఘిక దురాచారాలు నమ్మవద్దని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. ఆదివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం మాచినేనిపల్లిలో రాములు అనే వ్యక్తికి సంబంధించిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం భూమిపూజ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. రాములు భార్య గర్భవతి కావడంతో మంత్రిని భూ మిపూజ చేయాలని కాంగ్రెస్‌ నాయకులు, గ్రామస్తులు కోరా రు. రాములు తల్లి లక్ష్మీదేవమ్మ చేత భూమి పూజ చేయించాల ని మంత్రి సూచించగా.. ఆమె వితంతువు అని కొందరు నాయకులు మంత్రికి వివరించారు. 

వితంతువు అయితే భూ మి పూజ చేయకూడదా అంటూ మంత్రి వారిపై అసహనం వ్యక్తం చేశారు. లక్ష్మీదేవమ్మను పిలిచి ఆమెతోనే ఇంటి నిర్మా ణానికి పూజ చేయించి.. కొబ్బరికాయ కొట్టించారు. అనంతరం మంత్రి భూమిపూజ, పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ 200 ఏళ్ల క్రితమే రా జా రామ్మోహన్‌రాయ్‌ లాంటి మహనీయులు స్త్రీవిద్య, బాల్యవివాహాల రద్దు, వితంతు వివాహాలు వంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ప్రస్తుత ఆధునిక సమా జంలో కూడా వితంతువులను శుభకార్యాలకు దూరంగా పెట్టడం సమంజసం కాదన్నారు. ఈ సాంఘిక దురాచారం మన సంస్కృతికి మచ్చ అని, ఇలాంటి కళంకాలను ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిదని పిలుపునిచ్చారు. 

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు