కాంట్రాక్టు ఏఎన్‌ఎంలను తొలగించం

Published on Sat, 12/14/2024 - 05:07

హైదరాబాద్‌: రెగ్యులర్‌ ఉద్యోగులను నియమించి నప్పటికీ, కాంట్రాక్టు ఏఎన్‌ఎంలను ఉద్యోగాల నుంచి తీసేయబోమని రా­ష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో మంత్రిని ఏఎన్‌ఎంలు కలిసి తమ సమస్యలు విన్నవించారు. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేయాలని కోరారు. అయితే ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని మంత్రి తెలి­పారు. ఏఎన్‌ఎం రెగ్యులర్‌ పోస్టుల భర్తీకి ఈ నెల 29న నిర్వహించనున్న పరీక్ష యథావిధిగా జరుగుతుందని స్పష్టం చేశారు.

ఈ పరీక్షకు హాజరయ్యే కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలకు 30 మా­ర్కులు వెయిటేజీ ఇస్తున్నామని గుర్తుచేశారు. పోస్టుల సంఖ్యను పెంచాలని ఏఎన్‌ఎంలు కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం నోటిఫికేషన్‌లో ఇచ్చిన 1,931 పోస్టు­లకు అదనంగా మరో 323 పోస్టులను కలిపి, ఇదే నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రెగ్యులర్‌ ఉద్యోగం రానివారిని, చివరి వరకూ కాంట్రాక్ట్‌ ఉద్యోగంలో కొన­సాగిస్తామని భరోసా ఇచ్చారు. రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని ఏఎన్‌ఎంలు కోరగా, సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)