Breaking News

మైలేజ్ .. ఏసీ ఆన్ చేసి చెప్పాలి

Published on Mon, 01/19/2026 - 06:23

సాక్షి, హైదరాబాద్‌ : ‘ఆ కారు లీటరుకు 20 కి.మీ. మైలేజ్‌ వస్తుందని కంపెనీ చెప్తోంది. అంటే.. ఆన్‌ రోడ్‌ 15 నుంచి 18 వరకు రావచ్చు’... ఇది మనందరికీ సుపరిచితమైన మాటే. కంపెనీ చెప్పిన విధంగా కారు మైలేజ్‌ రాకపోవడానికి నిర్వహణ, ప్రయాణించే వేగంతోపాటు ఏసీ కూడా ఓ ప్రధాన కారణం. కార్ల తయారీ సంస్థలు తమ వాహనాల మైలేజీ నిర్ధారణ సమయంలో ఏసీని ఆఫ్‌ చేసి నడిపిస్తాయి. ఆ కారు వినియోగిస్తున్న వినియోగదారుడు ఏసీ ఆన్‌ చేసి నడిపినప్పుడు అది తగ్గిపోతుంది. దీనికి చెక్‌ చెప్పాలని కేంద్రం అధీనంలోని రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తూ డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఏడాది అక్టోబర్‌ 1 నుంచి ఇది తప్పనిసరి చేసింది.

అన్ని కార్లకూ వర్తింపజేస్తూ...
ప్రస్తుతం తాము యూరోపియన్‌ ప్రమాణాలు పాటిస్తున్నామని, దాని ప్రకారం ఏసీ ఆన్‌లో లేకుండా మాత్రమే మైలేజ్‌ను కొలుస్తున్నామని కార్ల తయారీదారులు చెబుతున్నారు. అయితే పారదర్శకత పెరిగి, వినియోగదారులు సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే వారికి కచ్చితమైన సమాచారం అందాలని మంత్రిత్వ శాఖ భావించింది. కార్లకు మరింత వాస్తవికంగా, కచ్చితమైన మైలేజ్‌ గణాంకాలు అందించాలనే ఉద్దేశంతో, రవాణా మంత్రిత్వ శాఖ ఎయిర్‌ కండిషనర్‌ (ఏసీ) ఆన్‌లోనే ఇంధన సామర్థ్య (ఫ్యూయల్‌ ఎఫీషియెన్సీ) పరీక్షలను తప్పనిసరిగా నిర్వహించేందుకు ప్రతిపా­దించింది.

ఈ నిబంధనలు ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్‌ వాహనాల­తోపాటు ఎలక్ట్రిక్‌ వాహనాలకు వర్తిస్తుంది. ఇక్కడ తయారయ్యే వాహనాలు, దిగుమతి అయ్యే వాటికీ తప్పనిసరి. వాహన తయారీదారులు తమ కార్ల యూజర్‌ మాన్యువల్‌లో ఏసీ ఆన్‌లో, ఏసీ ఆఫ్‌లో వాహనం నడిపినప్పుడు వచ్చే మైలేజ్‌ వివరాలను వేర్వేరుగా, తప్పనిసరిగా పేర్కొనాల్సి ఉంటుంది. ఈ సమాచారం వారి వెబ్‌సైట్లలోనూ ఉంచాల్సిందేనని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ఎం1 కేటగిరీ వాహనాలన్నింటికీ...
మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్‌ ఒకటి తర్వాత మార్కెట్‌లోకి వచ్చే ఎం1 కేటగిరీకి చెందిన కార్లకు ఇది తప్పనిసరి. ఎనిమిది సీట్లలోపు సామర్థ్యం ఉన్న పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, ఈవీ వాహనాలను ఎం1 కేటగిరీకి చెందినవిగా పరిగణిస్తారు. ఈ మైలేజ్‌ పరీక్షలను ఆటో­మోటివ్‌ ఇండస్ట్రీ స్టాండర్డ్‌ (ఏఐఎస్‌)–213 ప్రమాణాల ప్రకారం పరీక్షించాలని స్పష్టం చేసింది. ఈ ప్రమాణాలను రియల్‌ వరల్డ్‌ డ్రైవింగ్‌ పరిస్థితులను ప్రతిబింబించేలా కాలా­ను­గుణంగా సవరించనున్నారు.

ఏపీ వినియో­గం భారత్‌లో సాధారణం కావడంతోపాటు ఇది మైలేజ్‌పై గణనీయమైన ప్రభావం చూపుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నా­మని అధికారులు చెబుతు­న్నారు. ప్రస్తుతం ఏఐఎస్‌–213 ప్రమాణాలు ఏసీ ఆఫ్‌లోనే వాహన ఉద్గారాలు, ఇంధన వినియోగాన్ని కొలుస్తున్నాయి. కొత్త విధానం ప్రకారం ఇకపై ఏసీ వాడకం వల్ల వచ్చే అదనపు ఇంధన వినియోగం, ఉద్గారాలను కూడా నమోదు చేయనున్నాయి. దీని ద్వారా ఇంధన సామర్థ్యం, కాలుష్య స్థాయిలపై మరింత స్పష్టత లభిస్తుందని మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీని ద్వారా భవిష్యత్‌లో కార్ల యజమానులు ఆయా వాహనాల నిజమైన మైలేజ్‌ వివరాలను స్పష్టంగా తెలుసుకునే అవకా­Ô­èæం ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు.  
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)