Breaking News

హెచ్‌పీఎస్‌ జ్ఞాపకాలతో మురిసిన నాదెళ్ల

Published on Wed, 12/25/2024 - 05:49

సాక్షి, హైదరాబాద్‌/సనత్‌నగర్‌: సుమారు 45 ఏళ్ల క్రితం తాను చదువుకున్న స్కూల్లోని జ్ఞాపకాలు మదిలో మెదులుతుండగా సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల (Satya Nadella) హైదరాబాద్‌ బేగంపేటలోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ (హెచ్‌పీఎస్‌)లో అడుగుపెట్టారు. తాను ఆడుకున్న మైదానం, కూర్చున్న తరగతి గదులను చూసి మురిసిపోయారు. తనకు చదువుచెప్పిన ఉపాధ్యాయులను ఆప్యాయంగా పలకరించారు. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ వందేళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ ‘ఫ్లైట్‌ ఆఫ్‌ ది ఈగిల్‌’ పేరిట రూపొందిన కాఫీ టేబుల్‌ బుక్‌ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం జరిగింది.

ఈ కార్యక్రమానికి సత్య నాదెళ్లతో పాటు హెచ్‌పీఎస్‌కు చెందిన మరో పూర్వ విద్యార్థి అడోబ్‌ సీఈవో శంతను నారాయణ్‌ (shantanu narayen) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 1923లో జాగిర్దార్‌ కాలేజీగా ప్రస్థానం ప్రారంభమై వందేళ్లపాటు వేలాది మందికి విద్యాబుద్ధులు నేర్పిన హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ వందేళ్ల ఘన చరిత్రపై పుస్తకాన్ని విడుదల చేశారు. 

హెచ్‌పీఎస్‌లోనే నాయకత్వ లక్షణాలు నేర్చుకున్నాం
నాదెళ్ల, శంతను ఈ సందర్భంగా నాదెళ్ల, శంతను మాట్లాడుతూ హెచ్‌పీఎస్‌లోనే (HPS) తాము నాయకత్వ లక్షణాలను నేర్చుకున్నామని చెప్పారు. ఈ పాఠశాల తమకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని.. ఇక్కడ నేర్చుకున్న నాయకత్వ లక్షణాలతోనే ఇంత స్థాయికి ఎదిగామన్నారు. తన భార్య అనుపమ కూడా ఇక్కడే చదువుకుందని నాదెళ్ల తెలిపారు. హెచ్‌పీఎస్‌తో ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయని చెప్పారు.

చ‌ద‌వండి: ‘ఎన్నారై’ కుటుంబం వేధింపులకు ఒకరి బలి

పుస్తకంలోని కథలు, దృశ్యాలు పాఠశాల స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయని ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు ప్రశంసించారు. పుస్తకానికి ప్రధాన సంపాదకుడిగా కృష్ణమూర్తి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కాఫీ టేబుల్‌ బుక్‌ సబ్‌–కమిటీ సహ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి కందూర్, హెచ్‌పీఎస్‌ సొసైటీ అధ్యక్షుడు గుస్తీనోరియా, ఫయాజ్‌ఖాన్‌ క్రియేటివ్‌ హెడ్‌ ప్రణవ్‌ పింగిల్, హెడ్‌ రీసెర్చర్‌ సంజీవ్‌ చక్రవర్తి, హెడ్‌ డిజైనర్‌ అనీష్‌ పెంటి, లీడ్‌ రైటర్‌ అలోక్‌ తదితరులు పాల్గొన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)