Breaking News

‘నాగోబా’ ప్రచార యాత్రకు శ్రీకారం

Published on Sat, 01/04/2025 - 04:40

ఇంద్రవెల్లి/సిరికొండ: ప్రచార రథాన్ని ప్రారంభించి నాగోబా జాతరకు మెస్రం వంశీయు లు శ్రీకారం చుట్టారు. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌కు మెస్రం వంశీయులు భారీగా తరలివచ్చారు. నాగోబా మురాడి వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్‌ సమక్షంలో కటోడ మెస్రం కోసేరావ్, పర్ధాన్‌ దాదారావ్‌ల ఆధ్వర్యంలో ప్రచార రథాన్ని ప్రారంభించారు.

ఏడు రోజుల పాటు మెస్రం వంశీయులు ఉన్న గ్రామాల్లో ప్రచా రం చేపడతారు. ఇందులో భాగంగా తొ లిరోజు సిరికొండ మండలకేంద్రంలోని కుమ్మరిస్వామి వద్ద మహాపూజకు అవసరమయ్యే కుండల తయారీకి ఆర్డర్‌ ఇచ్చారు. అక్కడి నుంచి అదే మండలంలోని రాజన్‌పేట్‌కు చేరుకొని తమ వంశీయుల ఇళ్ల వద్ద రాత్రి బస చేశారు. ఇలా రోజుకో ఊరిలో బస చేస్తూ, ఈనెల 10న ఉదయం కేస్లాపూర్‌లోని నాగోబా మురాడి వద్దకు తిరిగి చేరుకుంటా రు. అదే రోజున పవిత్ర గంగా జల సేకరణకు  పాదయాత్ర ప్రారంభిస్తామని వెంకట్‌రావ్‌ తెలిపారు. 

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం గోదావరి హస్తినమడుగు వరకు పాదయాత్రగా వెళ్లి అక్కడి నుంచి పవిత్ర గంగాజలం తీసుకొస్తారు. ఆ గంగాజలంతో ఈనెల 28న నాగోబాను అభిషేకించి జాతరను ప్రారంభిస్తామని వెంకట్‌రావ్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో మెస్రం వంశపెద్దలు చిన్ను, బాదిరావ్, హనుమంత్‌రావ్, కోసేరావ్, తుకారాం, దాదారావ్, తిరుపతి, వంశ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. 

ఆకట్టుకున్న ప్రచారం రథం
జాతర నిర్వహణలో ప్రచార రథానికి (చకడ) ప్రత్యేకత ఉంది. దీనికి పదేళ్ల తర్వాత సొబగులు అద్దారు. నార్నూర్‌ మండలం గుండల గ్రామానికి చెందిన మెస్రం మల్కు ఆధ్వర్యంలో కొంతమంది కొలాంల సహకారంతో కొత్తగా నాగోబా ప్రతిమతో కూడిన జడపతోపాటు జువ్వను అమర్చారు. శుక్రవారం కేస్లాపూర్‌కు తీసుకొచి్చన దీనిని మెస్రం వంశీయులు ఆసక్తిగా తిలకించారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)