Breaking News

అమ్మ కాని ‘అమ్మ’

Published on Sun, 04/09/2023 - 02:00

పసిబిడ్డకు తల్లిపాలే అమృతం. కానీ అమ్మతనం అందివచ్చినా పిల్లలకు పాలు ఇవ్వలేని స్థితికొందరు తల్లులది. ఆ తల్లుల పాలిట ఆపద్బాంధవిలా, శిశువులకు తల్లిలా నిలుస్తోంది ఖమ్మం జిల్లా ప్రధాన ఆస్పత్రిలోని సమగ్ర తల్లిపాల సేకరణ కేంద్రం. ఏడాదిలో 599 మంది తల్లుల నుంచి సేకరించిన పాలను 626 మంది శిశువులకు అందజేసి ఆకలి తీర్చింది.

శిశు మరణాలు తగ్గించడం, వారిని ఆరోగ్యవంతులను చేయడమే లక్ష్యంగా నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ద్వారా దేశంలోని బెంగళూరు, కేరళ, ఢిల్లీ, చెన్నై తర్వాత ఐదో పెద్ద కేంద్రాన్ని ఖమ్మం ఆస్పత్రిలో గత ఏడాది ఏప్రిల్‌ 30న ఏర్పాటుచేశారు. హైదరాబాద్‌లోని నిలోఫర్, వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రుల్లో  మినీ మిల్క్‌ బ్యాంకులు ఉండగా ఖమ్మంలో మాత్రం ‘అమృతం’ పేరిట మెగా మదర్‌ మిల్క్‌ బ్యాంక్‌ అందుబాటులోకి వచ్చింది.     
– సాక్షిప్రతినిధి, ఖమ్మం

ప్రసవాలే ప్రాధాన్యతగా..
ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోజుకు సగటున 30 నుంచి 40 వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. ఇక్కడ కంగారూ మదర్‌ కేర్‌ సెంటర్‌ ఉండటంతో బరువు తక్కువగా పుట్టిన శిశువులను తీసుకొస్తారు. వీరిలో తల్లి పాలు అందని పిల్లలు ఎక్కువగా ఉంటుండడంతో నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ఆధ్వర్యంలో సమగ్ర చనుబాల నిర్వహణ కేంద్రం(ఎస్‌ఎల్‌ఎంసీ) ఇక్కడ ఏర్పాటు చేశారు. రూ.42 లక్షల వ్యయంతో కేంద్రం.. భవన నిర్మాణానికి మరో రూ.73.39 లక్షలు వెచ్చించారు. ఇక్కడ తల్లుల నుంచి సేకరించిన చనుబాల బాటిళ్లను 400 నుంచి 600 వరకు నిల్వ సామర్థ్యం కలిగిన యంత్రాలున్నాయి.

తల్లుల నుంచి సేకరించిన పాలను మైనస్‌ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో భద్రపరుస్తుండడంతో ఆరునెలల పాటు వినియోగించే అవకాశం ఉంటుంది. కేజీన్నర లోపు బరువుతో పుట్టిన పిల్లలకే కాక, తల్లికి సరిపడా పాలు రాని సందర్భాల్లో పిల్లలకు ఈ పాలు పట్టిస్తారు. ఫలితంగా తల్లిపాలు అందక జరిగే శిశు మరణాలను అరికట్టడం సాధ్యమవుతోంది. ఆస్పత్రికి ప్రసవాల కోసం వచ్చే వారికి ఈ విషయమై అవగాహన కల్పించడంతో ఇప్పటివరకు 599 మంది తల్లుల నుంచి 2,14,100 మి.లీ. పాలను సేకరించి 626 మంది శిశువులకు అందజేశారు. ఇక్కడ తల్లిపాలు సేకరించేందుకు ఆరు బ్రెస్ట్‌   పంప్స్‌ ఏర్పాటు చేశారు.  

నిల్వ చేసుకునేందుకు వీలుగా.. 
ఆస్పత్రిలో డెలివరీ అయిన శిశువులు అనారోగ్యం పాలైతే ఇంక్యుబేటర్‌లో మూడు, నాలుగు రోజులు ఉంచాల్సి ఉంటుంది. దీంతో వారి తల్లులు తమ పాలను నిల్వ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. బ్రెస్ట్‌ పంప్స్‌ ద్వారా పాలు సేకరించి నిల్వ చేశాక, మళ్లీ శిశువులకు అవసరమైనప్పుడు అవే పాలు పడుతున్నారు. ఇలా 1,274 మంది తల్లులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు.

అంతేకాకుండా శిశుగృహాలు, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ప్రసవం జరిగి పాలు లేని శిశువులకు కూడా ఈ కేంద్రం ద్వారా పాలు అందజేస్తున్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రితోపాటు ఏరియా ఆస్పత్రులు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అవసరమైన శిశువులకు పాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 

శిశువులకు వరం 
ఆస్పత్రిలోని ఎస్‌ఎల్‌ఎంసీ పాలు అందని శిశువులకు ఇది వరం లాంటిది. పాలు ఎక్కువగా ఉన్న తల్లులు ఈ బ్యాంకుకు అందజేసేలా అవగాహన కల్పిస్తున్నాం. శిక్షణ తీసుకున్న స్టాఫ్‌ నర్సుల పర్యవేక్షణలో పాల సేకరణ, నిల్వ, పంపిణీ కొనసాగుతోంది.       – డాక్టర్‌ బి.వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్,  ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి 

తల్లులు ముందుకొస్తున్నారు 
ఈ అంశాలపై 14 రోజుల పాటు నీలోఫర్‌లో శిక్షణ పొందాం. ఆస్పత్రిలో ప్రసవించే తల్లులకు పాలు ఎక్కువగా ఉంటే ఈ కేంద్రంలో ఇవ్వాలని అవగాహన కల్పిస్తున్నాం. పాలు ఉండి పిల్లలకు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నవారికి కూడా ఫీడింగ్‌ విధానం గురించి వివరిస్తున్నాం. చాలా మంది తల్లులు పాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు.   – కృష్ణవేణి, స్టాఫ్‌ నర్స్, ఎస్‌ఎల్‌ఎంసీ, ఖమ్మం 

పిల్లలు ఏడవడం చూడలేక.. 
జిల్లా ఆస్పత్రిలోనే నాకు డెలివరీ జరిగింది. నేను ఉంటున్న వార్డులో కొందరు తల్లుల వద్ద పాలు సరిపోక పిల్లలు ఏడుస్తుండడం చూశా. అది చూడలేక.. నా దగ్గర మా పాపకు సరిపోను పాల కన్నా ఎక్కువే ఉండటంతో కేంద్రంలో ఇచ్చా. ఆ పిల్లలకు ఈ పాలు ఇస్తుండటం ఆనందాన్ని కలిగించింది. – గుగులోతు అనిత,     పెద్దతండా, ఖమ్మం

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు