నేడు గవర్నర్‌తో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల భేటీ

Published on Sat, 07/20/2024 - 05:35

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు రాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌తో భేటీ కానున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ భేటీకి గవ ర్నర్‌ అపాయింట్మెంట్‌ ఇచ్చినట్లు సమాచారం. పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇటీవల కేటీఆర్‌ నేతృత్వంలో అసెంబ్లీ స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ను కలిసి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం గవర్నర్‌తో జరిగే భేటీలోనూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల బృందం ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించే అవకాశముంది.

క్షేత్రస్థాయిలో ప్రొటోకాల్‌ ఉల్లంఘనలతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కూడా సాక్ష్యాధారాలను గవర్నర్‌కు బీఆర్‌ఎస్‌ బృందం అందజేస్తుంది. దీంతోపాటు రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలు, పోటీ పరీక్షల నిర్వహణపై నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలు, వారిపై పోలీస్‌ కేసుల నమోదు వంటి అంశాలను కూడా గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లనున్నా రు. ఈ నెల 23న రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యేలోపే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేలా చూడాలని కేటీఆర్‌ రాష్ట్ర గవర్నర్‌కు విజ్ఞప్తి చేయనున్నారు. అప్పటికి అనర్హత వేటు పడకుంటే ఇదే అంశాన్ని అసెంబ్లీలోనూ ఎత్తిచూపాలని బీఆర్‌ఎస్‌ వ్యూహం సిద్ధం చేస్తోంది.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)