Breaking News

‘మేడిగడ్డ’ పునరుద్ధరిస్తారా.. బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలా

Published on Fri, 11/07/2025 - 06:08

సాక్షి, హైదరాబాద్‌: కుంగిపోయిన మేడిగడ్డ బరాజ్‌కు మరమ్మతులు నిర్వహించి పునరుద్ధరించేలా తక్షణమే సిబ్బంది, సామగ్రి, యంత్రాలను నిర్మాణస్థలికి తరలించాలని ఎల్‌అండ్‌టీ–పీఈఎస్‌ జాయింట్‌ వెంచర్‌ను రాష్ట్ర నీటిపారుదల శాఖ ఆదేశించింది. లేకపోతే బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని.. భవిష్యత్తులో తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలు నిర్వహించే టెండర్లలో పాల్గొనకుండా నిషేధించాలని కోరుతూ సిఫారసు చేస్తామని హెచ్చరించింది. జాయింట్‌ వెంచర్‌కి సంబంధించిన ప్రభుత్వం వద్ద డిపాజిట్లతో పాటు ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్న పెండింగ్‌ బిల్లులనూ జప్తు చేసుకుంటామని హెచ్చరించింది.

నీటిపారుదల శాఖ రామగుండం సర్కిల్‌ సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ ఈ నెల 3న ‘ఎల్‌ అండ్‌ టీ’జనరల్‌ మేనేజర్, ప్రాజెక్టు మేనేజర్‌లకు ఈ మేరకు లేఖ రాశారు. లేఖ అందిన వారంలోగా సానుకూల స్పందన తెలియజేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. మేడిగడ్డ బరాజ్‌లోని 7వ బ్లాక్‌ 2023 అక్టోబర్‌ 21న కుంగిపోవడం తెలిసిందే. బరాజ్‌ తీవ్ర ప్రమాదంలో ఉన్నందున పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని పదేపదే కోరినా ఎందుకు సహకరించడం లేదని ‘ఎల్‌ అండ్‌ టీ’ని నీటిపారుదల శాఖ ప్రశ్నించింది. కంపెనీ క్రియాశీలరాహిత్యంతో దిగువ స్థాయి అధికారులను ఉన్నతాధికారులు నేరస్తులుగా చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. 

రెండుసార్లు అంచనాలు పెంపు.. 
మేడిగడ్డ బరాజ్‌ను రూ. 2,591 కోట్ల అంచనాతో నిర్మించడానికి పరిపాలనా అనుమతులిస్తూ 2016 మార్చి 1న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. రూ. 1,849.30 కోట్లతో 24 నెలల గడువులో బరాజ్‌ నిర్మించడానికి 2016 ఆగస్టు 26న నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీతో రామగుండం సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందంలో లేని అదనపు పనులు చేయాల్సి రావడంతో 2018 మే 19న తొలిసారిగా అంచనాలను రూ. 3260 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండోసారి అంచనాలను రూ. 4,613 కోట్లకు పెంచగా 2022 మే 9న నిర్మాణ సంస్థతో అనుబంధ ఒప్పందాన్ని సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ చేసుకున్నారు. 

5 నోటీసులిచ్చినా ఎల్‌ అండ్‌ టీ స్పందించలేదు.. 
మేడిగడ్డ బరాజ్‌ 2023 అక్టోబర్‌ 21న కుంగిపోగా అంతకు ముందే బరాజ్‌లోని లోపాలను గుర్తించి మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం ఐదుసార్లు నోటీసులు ఇచ్చినా ‘ఎల్‌ అండ్‌ టీ’స్పందించలేదు. ఒప్పందం ప్రకారం అదనపు పనులతోపాటు మిగులు పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించిన ‘ఎల్‌ అండ్‌ టీ’కి జారీ చేసిన వర్క్‌ కంప్లీషన్‌ సర్టిఫికెట్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. అది సరైన నిర్ణయమేనని తాజా లేఖలో రామగుండం సర్కిల్‌ సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ పేర్కొన్నారు. కేవలం అనుభవం కోసం ఈ సరి్టఫికెట్‌ జారీ చేశామని.. దాన్ని స్వీయ రక్షణ కోసం వాడుకోవడం అన్యాయమని ఎల్‌ అండ్‌ టీ తీరును ఆక్షేపించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)