కాళేశ్వరంలో నీటినిల్వకు సన్నద్ధం!

Published on Mon, 06/03/2024 - 03:56

కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నారం బ్యారేజీలో త్వరగా మరమ్మతు పనులు పూర్తి చేసి నీటిని నిల్వ చేయడానికి ఇంజనీరింగ్‌శాఖ అధికారులు సన్నద్ధం అవుతున్నట్టు తెలిసింది. అన్నారం బ్యారేజీలోని సీపేజీ లీకేజీలకు గ్రౌటింగ్‌ పనులను ఆదివారం అ«ధికారులు ప్రారంభించారు. ఎన్‌డీఎస్‌ఏ సూచనల మేరకు ఇంజనీరింగ్‌ అధికారులు సీసీ బ్లాక్‌లు తొలగించి మళ్లీ అమర్చుతున్నారు. బ్యారేజీ క్రస్ట్‌గేట్ల ముందు, వెనుకాల ఉన్న ఇసుక మేటలు తొలగించారు. అక్కడి సీపేజీ లీకేజీలను సిమెంట్, ఇసుక మిశ్రమాన్ని 38వ పియర్‌ వెంట్‌ వద్ద గ్రౌటింగ్‌ ద్వారా నింపుతున్నారు.

వర్షాకాలంలో అన్నారం బ్యారేజీ నింపి ఎగువన సుందిళ్ల పంపుహౌస్‌ ద్వారా ఎత్తిపోసి నీటిని తరలించడానికి ఈఎన్‌సీ జనరల్‌ అనిల్‌కుమార్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అన్నారం బ్యారేజీకి ఎగువన పెద్దవాగు, మానేరు, గ్రావిటీ ద్వారా వచ్చే వరద నీరు కూడా వాడుకునే వీలుందని, ఈ నీటిని ఎగువన సుందిళ్లను తరలించడానికి యత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీ 7వ బ్లాక్‌లో కుంగిన పియర్‌లు 19, 20, 21ల దిగువన సీసీ బ్లాక్‌ల అమరిక, షీట్‌ఫైల్స్‌ దింపుతున్నారు. కాగా, ఆదివారం కురిసిన వర్షానికి అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల్లో పనులు నిలిచాయి. కొద్దిపాటి వర్షానికే అన్నారం బ్యారేజీగేట్ల ముందు భాగంలోకి నీరు చేరుతుందని ఇంజనీరింగ్‌ అధికారులు ఆందోళన చెందుతున్నారు.

Videos

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)