Breaking News

ప్రీతి ఫోన్‌ కాల్‌ ఆడియో వెలుగులోకి.. తల్లితో ఏం చెప్పింది?

Published on Sun, 02/26/2023 - 11:12

సాక్షి, హైదరాబాద్‌: వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కళాశాల పీజీ వైద్య విద్యార్థిని ధరావత్‌ ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. నిమ్స్‌లో ఐదు రోజులుగా చికిత్స కొనసాగుతోంది. కాగా, సైఫ్‌ వేధింపులపై మెడికో ప్రీతి ఫోన్‌ కాల్‌ ఆడియో బయటపడింది. ఆత్మహత్యాయత్నానికి ముందు తల్లికి ప్రీతి ఫోన్‌ చేసి తన బాధను ఫోన్‌కాల్‌లో చెప్పుకుంది.

‘‘సైఫ్‌ నాతో పాటు చాలా మంది జూనియర్లను వేధిస్తున్నాడు. సీనియర్లు అంతా ఒక్కటే. నాన్న పోలీసులతో ఫోన్‌ చేయించినా లాభం లేకుండా పోయింది. సైఫ్‌ వేధింపులు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి’’ అంటూ తల్లితో ప్రీతి ఆవేదన వ్యక్తం చేసింది. సైఫ్‌పై ఫిర్యాదు చేస్తే సీనియర్లంతా ఒకటై నన్ను దూరం పెడతారని, ప్రిన్సిపాల్‌కు ఎందుకు ఫిర్యాదు చేశారని హెచ్‌వోడి నాగార్జునరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని ప్రీతి ఆవేదన చెందగా, సైఫ్‌తో మాట్లాడి ఇబ్బంది లేకుండా చేస్తానని ప్రీతి తల్లి చెప్పింది.

కాగా, ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సీనియర్‌ వైద్య విద్యార్థి ఎంఏ సైఫ్‌ వేధింపులే కారణమని తేలింది. ఘటనపై ప్రీతి కుటుంబ సభ్యుల ఆరోపణలు.. మెడికల్‌ కాలేజీ, ఎంజీఎం హెచ్‌ఓడీ వర్గాలు చెప్తున్న అంశాలు భిన్నంగా ఉండటంతో పోలీసులు సెల్‌ఫోన్, వాట్సాప్‌ గ్రూపులలో చాటింగ్‌ల ఆధారంగా విచారణ జరిపారు. ప్రీతిని సైఫ్‌ టార్గెట్‌ చేసి వేధించడం వల్లే ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా భావిస్తున్నామని పోలీస్‌ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తెలిపారు.
చదవండి: నవీన్‌ హత్యకేసు నిందితుడు హరిహర ఫోన్‌ కాల్‌ వైరల్‌

Videos

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు