Breaking News

డాక్టర్‌గా మారొద్దు.. మందులు రాయొద్దు

Published on Sat, 03/30/2024 - 04:31

సాక్షి, హైదరాబాద్‌: అర్హత లేకుండా ఎవరూ వైద్యం చేయకూడదని వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. తెలంగాణ క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (రిజిస్ట్రేషన్‌ అండ్‌ రెగ్యులేషన్‌) యాక్ట్‌–2010 ప్రకారం ప్రథమ చికిత్స చేసే ఆర్‌ఎంపీలు తమ పేరు ముందు డాక్టర్‌ అని పెట్టుకోకూడదని ఆదేశించింది. ఆర్‌ఎంపీలు స్థాయికి మించి వైద్యం చేస్తున్నట్లు అనేక ఆరోప ణలు వస్తున్నాయని... వారి వైద్యం వల్ల కొందరు రోగులు మృతిచెందినట్లు ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది.

కాబట్టి ప్రథమ చికిత్స చేసే వ్యక్తులు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ సూచించింది. ఆర్‌ఎంపీలు తమ చికిత్స కేంద్రం ముందు సూచిక బోర్డులపై ఫస్ట్‌ అయిడ్‌ సెంటర్‌ లేదా ప్రథమ చికిత్స కేంద్రం అని మాత్రమే ప్రదర్శించాలని... క్లినిక్, ఆసుపత్రి, నర్సింగ్‌ హోం, మెడికల్‌ సెంటర్‌ లేదా మరే ఇతర పేర్లతో సూచిక బోర్డులను ప్రదర్శించరాదని పేర్కొంది. ప్రథమ చికిత్స చేసే వ్యక్తులు సర్కారు సూచనలను ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటా మని హెచ్చరించింది.

ఆర్‌ఎంపీలకు సూచనలివీ...

  • ఆర్‌ఎంపీలు స్వయంగా రోగ నిర్ధారణ చేసి మందులు ఇవ్వడం లేదా ఇంజెక్షన్లు చేయడం వంటివి చేయరాదు. 
  • రోగులకు వైద్య మందుల చీటీని (ప్రిస్క్రిప్షన్‌) రాయకూడదు.
  • రోగులకు సెలైన్‌ బాటిల్స్‌ ఎక్కించరాదు.
  • ఇన్‌–పేషెంట్‌ వైద్యం చేయకూడదు, ల్యాబ్‌లను నిర్వహించరాదు.
  • అబార్షన్లు, కాన్పుల వంటి హైరిస్క్‌ చికిత్సలు చేయరాదు.
  • రోగులను ప్రలోభపెట్టి వైద్యం కోసం ఆసుపత్రులకు సిఫార్సు చేయడం లేదా బలవంతంగా పంపించడం చేయరాదు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)