Breaking News

ముక్క.. సుక్క!

Published on Sun, 02/08/2026 - 08:43

‘మేడ్చల్‌ జిల్లాలోని ఓ మున్సిపాలిటీలో విలీనమైన తండా. ఇక్కడ సుమారు 1,500 ఓటర్లున్నారు. వీరిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి  ఇంటికి కిలో చికెన్‌ సహా బాస్మతి రైస్, అర బాటిల్‌ మద్యం ఆదివారం సరఫరా చేసేలా ఏర్పాట్లు చేశారు. ఇలా ఈ ఒక్క తండాలో మాత్రమే కాదు ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీల్లోని విలీన గ్రామాల్లో ‘సండే’ ఎలక్షన్‌ దావత్‌ నడవనుంది’  

సాక్షి, రంగారెడ్డిజిల్లా: నగర శివారులోని రంగారెడ్డి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లోని 126 వార్డులు, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు.. 68 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచే కాకుండా స్వతంత్ర అభ్యర్థులు సహా మొత్తం 696 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ పీఠాలను ఆశిస్తున్న ఆశావహులు తమ వార్డుల్లో ఎలాగైనా గెలుపొందాలని భావిస్తున్నారు. ఆ మేరకు ఓటర్లను మచి్చక చేసుకునేందుకు రకరకాల హామీలు ఇవ్వడంతో పాటు ప్రతి రోజూ మద్యం, మాంసం సరఫరా చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుండటం, నేడు ఆదివారం కావడంతో అభ్యర్థులు ఓటర్లకు ఇంటికి కిలో మటన్‌/ చికెన్‌ సహా ఓటర్ల సంఖ్యను బట్టి బాస్మతి రైస్, అర బాటిల్‌ మద్యం సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు.  

ఒక్కో అభ్యర్థి ఖర్చు రూ.20 లక్షల పైనే.. 
అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ.లక్ష దాటకూడదనే నిబంధన ఉంది. కానీ ఇప్పటికే ఒక్కో అభ్యర్థి ఖర్చు రూ.20 లక్షలు దాటినట్లు సమాచారం. కాలనీ, అపార్ట్‌మెంట్‌ సంక్షేమ, కుల, కారి్మక సంఘాలు, వివిధ వర్గాల ఓటర్లతో గెట్‌ టు గెదర్‌ పారీ్టలు ఏర్పాటు చేసి కావాల్సినవన్నీ సమకూర్చుతున్నారు. ఒకరిని చూసి మరొకరు పంపకాలకు తెర తీయడంతో అభ్యర్థుల ఖర్చులు రెట్టింపవుతున్నాయి. ఖర్చుల కోసం ఇంట్లోని బంగారు ఆభరణాలు తాకట్టు పెడుతున్నారు. తెలిసిన వ్యాపారుల వద్ద తమ ఇళ్లు, ప్లాట్లు, వ్యవసాయ భూములను కుదువపెట్టి అప్పులు తెచి్చ, ఓటర్లకు పంచుతుండటం విశేషం. ఓటర్లు మాత్రం ‘మా ఓటు మీకే’ అంటూ వచి్చన ప్రతి అభ్యరి్థకీ హామీలివ్వడం గమనార్హం. భారీగా మద్యం, మాంసం పంపిణీ జరుగుతున్నా.. ఎన్నికల నిఘా వర్గాలు అటు వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.

కాంగ్రెస్‌ నేతలు ‘కోడ్‌’ ఉల్లంఘించారు
మేడ్చల్‌: అలియాబాద్‌ మున్సిపాలిటీ లాల్‌గడిమలక్‌పేట్‌లో శుక్రవారం చోటుచేసుకున్న ఘటనపై బీఆర్‌ఎస్‌ నాయకులు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణికుముదినికి, సైబరాబాద్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌ నాయకులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని  ఆరోపించారు.  కాంగ్రెస్‌ నాయకులు రాళ్లు రువి్వ, దాడులకు దిగారని వినతి పత్రంలో పేర్కొన్నారు. 
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, వివేకానంద, ఎమ్మెల్సీలు శంభీపూర్‌ రాజు, దాసోజ్‌ శ్రవణ్, పార్టీ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)