Breaking News

మెదక్‌ బంద్‌ ప్రశాంతం

Published on Mon, 06/17/2024 - 03:33

సాక్షి, హైదరాబాద్‌/ మెదక్‌జోన్‌/శంషాబాద్‌: మెదక్‌ పట్టణ బంద్‌ ప్రశాంతంగా జరిగింది. బీజేపీ నేతల ఆదివారం బంద్‌కు పిలుపునివ్వగా, వర్తక, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఇరువర్గాల ఘర్షణల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. శనివారం అర్ధరాత్రి దాటాక బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, బీజేవైఎం నేత సతీ‹Ùతోపాటు మరో ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. ఆదివారం ఉదయం వారిని జడ్జి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి వారికి రిమాండ్‌ విధించగా మెదక్‌ సబ్‌ జైలుకు తరలించారు. 
 
ఎవరినీ ఉపేక్షించం: ఐజీ రంగనాథ్‌ 
గొడవకు బాధ్యులైన ఎవరినీ ఉపేక్షించమని, ఇందుకు కారణమైన 45 మందిపై కేసులు నమోదు చేశామని మల్టీజోన్‌ ఐజీ రంగనాథ్‌ తెలిపారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ, దాని అనుబంధ సంస్థలకు చెందిన 23 మందితోపాటు 22 మంది ముస్లింలపై కేసులు నమోదు చేశామన్నారు. పోలీసులు ఒక్కవర్గం వారిని మాత్రమే రిమాండ్‌ చేశారని, మరోవర్గం వారిని చేయలేదంటూ సోషల్‌ మీడియాలో వచ్చే ప్రచారాన్ని నమ్మొద్దని, ఘటనకు బాధ్యులైన ముస్లింలను కూడా రిమాండ్‌ చేస్తామన్నారు.  

» మెదక్‌లో రెండువర్గాల మధ్య జరిగిన ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆరా తీశారు. పోలీస్‌ ఉన్నతాధికారులకు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు.  
» మెదక్‌ ఘటనపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. కేసీఆర్‌ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణలో ఎలాంటి మత కల్లోలాలకు తావు లేకుండా పూర్తి ప్రశాంతంగా ఉండేదని గుర్తు చేశారు.  
» గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మెదక్‌ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ముంబయి నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అల్లర్లలో గాయపడిన వారిని మియాపూర్‌లోని ఓ ఆస్పత్రిలో పరామర్శించారు. అనంతరం రాజాసింగ్‌ తన నివాసానికి వెళ్లేంత వరకు ఆర్‌జీఐఏ పోలీసులు ఆయన వెంటే ఉన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)