Breaking News

Hyderabad: మేయర్‌ విజయలక్ష్మిపై కేసు నమోదు

Published on Mon, 10/14/2024 - 11:21

బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌ రోడ్డునంబర్‌–12లోని ఎన్‌బీటీనగర్‌ ప్రభుత్వ పాఠశాల ఎదురుగా ఉన్న మైదానంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో నిబంధనలకు విరుద్ధంగా డీజే ఏర్పాటు చేయడంతో పాటు గడువు ముగిసిన తర్వాత కూడా సౌండ్‌ పొల్యుషన్‌కు పాల్పడిన ఘటనలో నగర మేయర్‌తో పాటు మరో ఇద్దరిపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఈ నెల 10వ తేదీ రాత్రి 10 గంటల çసమయంలో బంజారాహిల్స్‌ రోడ్డునంబర్‌–12లోని ఎన్‌బీటీనగర్‌లో అమ్మవారి విగ్రహాల నిమజ్జన ఊరేగింపుతో పాటు మండపాలను కానిస్టేబుళ్లు ఎస్‌కే నజీర్‌ అహ్మద్, హోంగార్డు సాయి ప్రసాద్‌లు పర్యవేక్షిస్తున్నారు.

 రాత్రి 11.40 గంటల ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల ముందు జరుగుతున్న బతుకమ్మ వేడుకల్లో భారీ సౌండ్‌తో డీజే ఏర్పాటు చేశారని, శబ్ద కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని పోలీసులకు సమాచారం అందింది. దీంతో నజీర్‌ అహ్మద్, సాయిప్రసాద్‌లు అక్కడికి చేరుకుని డీజేను ఆపాల్సిందిగా నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో గ్రేటర్‌ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మీ అక్కడికి చేరుకుని పోలీసులు ఇందులో జోక్యం చేసుకోవద్దని, మ్యూజిక్‌ను కొనసాగించాలని వారికి సూచించారు. 

భారీ శబ్ద కాలుష్యంతో ఈవెంట్‌ను అలాగే కొనసాగించారని, వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కానిస్టేబుల్‌ నజీర్‌ అహ్మద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో బతుకమ్మ వేడుకల నిర్వాహకులు కందాడి విజయ్‌కుమార్, మ్యూజిక్‌ ప్లే చేస్తున్న మహ్మద్‌ గౌస్, జోక్యం చేసుకోవద్దంటూ చెప్పిన మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మిపై బంజారాహిల్స్‌ పోలీసులు బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 223, 280, 292, 49 రెడ్‌విత్‌ 3 (5), సెక్షన్‌ 21/76 సీపీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)