Breaking News

పత్తికి గరిష్ట ధర రూ.7,200

Published on Thu, 06/13/2024 - 04:25

సాక్షి, హైదరాబాద్‌: వరి, పత్తి, కంది, మొక్కజొన్న, సోయాచిక్కుడు వంటి పంట ఉత్పత్తులకు మార్కెట్‌లో అధిక ధరలు లభిస్తాయి. ఈ విషయాన్ని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని మార్కెటింగ్‌ ఇంటెలిజెన్స్‌ వెల్లడించింది. శాస్త్రీయ పద్ధతుల్లో విశ్లేషణ చేసి ఈ ధరలను రూపొందించింది. 

22 ఏళ్లుగా రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో నెలవారీగా ఉన్న 21 రకాల పంట దిగుబడుల ధరలను నమూనాగా తీసుకొని వాటి ఆధారంగా ధరల అంచనాలను సిద్ధం చేసింది. వాటి ఆధారంగా ఏఏ పంటలు వేస్తే ఏ మేరకు దిగుబడులు వస్తాయో, వాటి ఆదాయంపై రైతులకు అవగాహన పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ మేరకు కసరత్తు చేసినట్టు చెబుతున్నారు.  

» ఈ సీజన్‌లో పత్తి దిగుబడి వచ్చే నవంబర్‌–ఫిబ్రవరి మధ్య గరిష్టంగా క్వింటాకు రూ.7,200 వరకు ధర వస్తుందని వ్యవసాయ వర్సిటీ ప్రకటించింది. కనిష్టంగా రూ. 6,600 ఉంటుంది. 
»    వరి సాధారణ రకానికి నవంబర్‌–డిసెంబర్‌ మధ్య కాలంలో రూ. 2,203 నుంచి రూ. 2,350 ధర పలుకుతుంది. ఇక వరి గ్రేడ్‌ ఏ రకానికి అదే కాలంలో రూ. 2,290 నుంచి రూ. 2,680 వరకు ధర పలుకుతుందని పేర్కొంది.  
»    మొక్కజొన్నకు అక్టోబర్‌–నవంబర్‌ మధ్యకాలంలో రూ. 2,150 నుంచి రూ. 2,350 వరకు ధర వస్తుంది.  
»   పంట రకం, నాణ్యత, అంతర్జాతీయ ధర లు, ఎగుమతులు, దిగుమతులు పరిమితు ల మూలంగా ధరల్లో మార్పులు ఉండొచ్చు.  ధరను బట్టి పంటలు వేసుకోవచ్చని వర్సిటీ సూచించింది.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)