Breaking News

మారిష‌స్ మ‌హిళ‌కు పాంక్రియాస్‌లో అరుదైన క‌ణితి

Published on Fri, 01/02/2026 - 18:17

హైద‌రాబాద్: మారిష‌స్ దేశానికి చెందిన 55 ఏళ్ల మ‌హిళ‌కు ఉన్న‌ట్టుండి షుగర్ లెవల్స్ త‌గ్గిపోయేది. అప్ప‌టిక‌ప్పుడు ఏమైనా తింటే స‌రే.. లేక‌పోతే క‌ళ్లు తిరిగి ప‌డిపోయేవారు. ఏంటా అని అక్క‌డి వైద్యుల‌కు చూపిస్తే, ఆమెకు పాంక్రియాస్ (క్లోమం)లో అరుదైన క‌ణితి (ఇన్సులినోమా) ఉంద‌ని తేలింది. సంక్షిష్టమైన శస్త్రచికిత్స కావడంతో అక్క‌డి వైద్యులు దానికి శ‌స్త్రచికిత్స చేయ‌డం మారిష‌స్‌లో సాధ్యం కాద‌ని, హైద‌రాబాద్ పంపారు. ఇక్క‌డ కొండాపూర్ కిమ్స్ ఆస్ప‌త్రిలో ఆమెకు చికిత్స అందించిన క‌న్స‌ల్టెంట్ స‌ర్జిక‌ల్ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జిస్ట్, రోబోటిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ సీహెచ్ న‌వీన్ కుమార్ ఇందుకు సంబంధించిన వివ‌రాలు తెలిపారు.

“ఆ మ‌హిళ నేరుగా కొండాపూర్ కిమ్స్ ఆస్ప‌త్రికి వ‌చ్చారు. సాధార‌ణంగా పాంక్రియాస్‌లో క‌ణితుల‌ను తొల‌గించ‌డం చాలా సంక్లిష్ట‌మైన ప్ర‌క్రియ‌. ఎందుకంటే, పాంక్రియాస్‌కు కుట్లు వేయ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. ఆమెకు ఇన్సులినోమా అనే ర‌కం క‌ణితి ఉన్న‌ట్లు గుర్తించాం. మా బృందంతో పాటు అనస్థీషీయా బృందం డా. వీరభధ్ర రావు తో కలిసి అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను కేవలం లాప్రోస్కొపిక్ ప‌ద్ధ‌తిలో చిన్న చిన్న రంధ్రాలు మాత్ర‌మే చేసి ఆమె పాంక్రియాస్‌లో ఉన్న క‌ణితిని తొల‌గించాం. అది బాగా చిన్న క‌ణితి కావ‌డంతో.. ఇంట్రాఆపరేటివ్ అల్ట్రాసౌండ్, ఇత‌ర టెక్నాల‌జీలు వాడి దాన్ని తీసేశాం. శ‌స్త్రచికిత్స అయిన త‌ర్వాత ఎలాంటి ఇబ్బందులు లేక‌పోవ‌డంతో.. ఆరు  రోజుల త‌ర్వాత ఆమెను డిశ్చార్జి చేశాం” అని డాక్ట‌ర్ న‌వీన్ కుమార్ తెలిపారు.

Videos

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)