Breaking News

ఆల్జీబ్రా.. గుండె గాబరా ఇక ఉండదు

Published on Fri, 12/12/2025 - 02:02

సాక్షి, సిద్దిపేట: ఆల్జీబ్రా.. గుండె గాబరా అనే చందంగా లెక్కలంటే కొందరు విద్యార్థులకు చెప్పలేనంత భయం. పరీక్షల్లో మిగతా సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు సాధిస్తున్నా మ్యాథ్స్‌లో మాత్రం జస్ట్‌ పాస్‌ మార్కులతో గట్టెక్కడం లేదా ఫెయిల్‌ అవుతూ ఉంటారు. అదే సమయంలో ఆటపాటలను మాత్రం ఎంతో ఇష్టపడుతుంటారు. విద్యార్థుల్లో గణితంపట్ల ఉన్న ఈ భయాన్ని పోగొట్టి లెక్కలంటే ఇష్టం పెంచేందుకు సిద్దిపేట జిల్లా వర్గల్‌లోని జవహర్‌ నవోదయ విద్యాలయం సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. 

విద్యాలయం ప్రాంగణంలో దాదాపు 500 గజాల విస్తీర్ణంలో మ్యాథ్స్‌ థీమ్‌ పార్కును ఏర్పాటు చేసింది. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఉపయోగపడేలా థీమ్‌ పార్కును తీర్చిదిద్దింది. తరగతి గదిలో బోధనతోపాటు ఓపెన్‌ స్పెస్‌ లర్నింగ్‌ ద్వారా విద్యార్థులు సులువుగా, త్వరగా అర్థం చేసుకునేలా గణితం ఉపాధ్యాయులు అమ్మని, శేషు, అనిల్‌ కుమార్‌ పాఠాలు బోధిస్తున్నారు. వారంలో రెండు క్లాస్‌లను మ్యాథ్స్‌ పార్క్‌లో ప్రత్యక్షంగా వివిధ ఆకారాలను చూపిస్తూ బోధిస్తున్నారు. 

సర్కిల్‌ తీరంస్, టైప్‌ ఆఫ్‌ యాంగిల్స్, ట్రైయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్, ఎక్స్‌టర్నల్, పైథాగరస్‌ పెంటగాన్, కోన్, ట్రైయాంగిల్‌ ప్రిజం, స్క్వేర్‌ ప్రిజం, త్రీ డైమన్షనల్‌ ప్లేన్, సిలిండర్, క్యూబ్, క్యూబాయిడ్, పిరమిడ్‌ వంటి ఆకారాలతో పార్క్‌ను నిర్మించారు. అందులో ల్యాడర్‌ గేమ్, ప్రైమ్‌ ఫాక్టర్స్‌ ఆటలను ఆడిస్తూ తరగతులు చెబుతున్నారు. 

జామెట్రికల్, టూడీ, త్రీడీ, సాలిడ్‌ ఫిగర్స్, క్షేత్ర సమితి, వైశాల్యాలు, ఘన పరిమాణాలు, సమాంతర రేఖలు, గ్రాఫ్‌లపై విద్యార్థులకు మెరుగైన అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు పార్క్‌ మధ్యలో ప్రఖ్యాత గణిత మేధావి శ్రీనివాస రామానుజన్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

సులభంగా అర్థమవుతోంది 
మ్యాథ్స్‌ థీమ్‌ పార్క్‌లో వివిధ తీరంస్‌ను చూపిస్తూ ప్రత్యక్షంగా బో«ధించడంతో సులభంగా అర్థమవుతోంది. వివిధ యాంగిల్స్‌ గురించి ఇలా నేర్పించడంతో ఎప్పటికీ గుర్తుండి పోతాయి. ఓపెన్‌ స్పేస్‌ లర్నింగ్‌ ఎంతో ఉపయోగపడుతోంది.  – అఖిలేష్, 7వ తరగతి 

ఓపెన్‌ లర్నింగ్‌లో భాగమే.. 
విద్యార్థులు చూస్తూ నేర్చుకోవడంతో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. విద్యార్థులకు తరగతి గదిలోనే బోధన కాకుండా ఓపెన్‌ లర్నింగ్‌ ద్వారా విద్యను అందిస్తున్నాం. హ్యాండ్స్‌ ఆన్‌ యాక్టివిటీలో భాగంగా మ్యాథ్స్‌ పార్క్‌ను నిర్మించాం. పీఎంశ్రీ పథకం, పాఠశాల నిధులతో ఈ పార్క్‌ను ఏర్పాటు చేశాం.  – రాజేందర్, ప్రధానోపాధ్యాయుడు, నవోదయ విద్యాలయ, వర్గల్‌ 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)