Breaking News

భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

Published on Sat, 07/15/2023 - 01:24

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్త ర్వులు జారీ చేశారు. ఎనిమిది మంది వెయిటింగ్‌లో ఉన్న అధికా రులకు ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. సీని యర్‌ ఐఏఎస్‌ అధికారులు శశాంక్‌ గోయల్, శైలజా రామయ్యర్‌ల సేవలను ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీ, యువజన సర్వీసుల శాఖలో వినియోగించుకోవాలని నిర్ణయించింది.

ఈ మేరకు వెయిటింగ్‌లో ఉన్న 1990 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి శశాంక్‌ గోయల్‌కు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ) డైరెక్టర్‌ జనరల్‌గా పోస్టింగ్‌ ఇవ్వగా, 1997 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి శైలజా రామయ్యర్‌ను యు వజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. శాట్స్‌ ఎండీగా, ఆర్కి యాలజీ డైరెక్టర్‌గా ఆమెకు అదనపు బాధ్య తలు అప్పగించింది.

అలాగే వెయిటింగ్‌లో ఉన్న అధికారులు హరిచందన, వర్షిణి, హై మావతి, నిఖిల, సత్యశారదాదేవి, అరుణ శ్రీలకు పోస్టింగ్‌లు ఇచ్చింది. జీహెచ్‌ఎంసీలో అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న ప్రియాంకా ఆలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా నియమించింది. అదే విధంగా ములుగు అద నపు కలెక్టర్‌గా ఉన్న ఇల త్రిపాఠికి అదే జిల్లా కలెక్టర్‌గా, సిద్దిపేట అదనపు కలెక్టర్‌ ము జమిల్‌ఖాన్‌కు పెద్దపల్లి కలెక్టర్‌గా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్‌గా ఉన్న అనుదీప్‌ దురిశెట్టికి హైదరాబాద్‌ కలెక్టర్‌గా పదోన్నతి కల్పించింది.

పెద్దపల్లి కలెక్టర్‌గా ఉన్న సంగీత సత్యనారాయణను టీఎస్‌ ఫుడ్స్‌ ఎండీగా, ములుగు కలెక్టర్‌ కృష్ణ ఆదిత్యను కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సభ్య కార్యదర్శిగా నియమించింది. జగిత్యాల అద నపు కలెక్టర్‌గా ఉన్న మంద మకరందుకు నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమి షనర్‌గా బాధ్యతలు అప్పగించింది. ప్రభు త్వం మొత్తం 14 మంది అదనపు కలెక్టర్లను ఈసారి బదిలీ చేయడం గమనార్హం


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)