Breaking News

ప్రాణం తీసిన వివాహేత‌ర సంబంధం..

Published on Sun, 06/22/2025 - 12:06

గద్వాల క్రైం: మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. వివాహేతర సంబంధమే ఆమె హత్యకు కారణమని గద్వాల డీఎస్పీ మొగిలయ్య వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం జిలా ్లకేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. కేటీదొడ్డి మండలం కోతులగిద్దకు చెందిన అనిత (26)కు పాతపాలెం గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులుతో కొంతకాలం కిందట వివాహమైంది. కాగా అనిత అదే గ్రామానికి చెందిన మాల దలాయి రంగస్వామితో వివాహేతర సంబంధం కొనసాగించేది.

ఆమె మరొకరితో చనువుగా ఉండటంతో పలుమార్లు ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో భర్త ఈ నెల 15న హైదరాబాద్‌లో కూలీ పనులకు వెళ్లగా.. అదేరోజు రాత్రి రంగస్వామి ఇంటికొచ్చా డు. అయితే ఆమె మరొకరితో చనువుగా ఉండటంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న రంగస్వామి.. ఆమె గొంతుకు చీర బిగించి హత్య చేశాడు. ఈ ఘటనపై అనిత తమ్ముడు అశోక్‌ ఫిర్యాదు మేరకు కేటీదొడ్డి ఎస్‌ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

 రంగస్వామి అనితతో తరచూ ఫోన్‌లో మాట్లాడటాన్ని గుర్తించి శనివారం తెల్లవారుజామున సంగాల పార్కు సమీపంలో అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. దీంతో నిందితుడు నేరం అంగీకరించారని.. ఐదురోజుల్లో కేసు ఛేదించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. రంగస్వామిని గద్వాల కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సీఐ శ్రీను, ఎస్‌ఐ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)