Breaking News

ఆర్థిక ఇబ్బందులతో వివాహిత ఆత్మహత్య

Published on Mon, 06/22/2026 - 13:35

హైదరాబాద్‌: ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో భర్తతో గొడవపడి ప్రేమ వివాహం చేసుకున్న భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన దోమలగూడ పీస్‌ పరిధిలోని దోమల గూడ అడ్వొకేట్స్‌ కాలనీలో శనివారం అర్ధరాత్రి 12 గంటలకు జరిగింది. డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.మధుసూదనరావు వివరాల ప్రకారం..

కాలనీలో నివాసం ఉండే గౌసియా బేగం (32) మణికంఠ రాజు తొమ్మిదేళ్ల క్రితం (2015)లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి విక్రాంత్‌(9) కుమారుడు ఉన్నాడు. గౌసియా వృత్తిరీత్యా న్యాయవాది.  కొంత కాలం క్రితం హందూజా ఫైనాన్స్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. మణికంఠ బజాజ్‌ ఫైనాన్స్‌లో రికవరీ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇటీవల ఆర్థిక ఇబ్బందుల కారణంగా భార్య భర్తలు తరచూ గొడవలు పడేవారు. ఆరు నెలల నుంచి గొడవల కారణంగా మణికంఠ రోజూ మద్యం తాగివచ్చి గౌసియాను వేదిస్తూ ఉండేవాడు. 

ఇదే క్రమంలో శనివారం రాత్రి కూడా గొడవ జరిగింది. మనస్థాపానికి గురైన గౌసియా ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గౌసియా కుటుంబ సభ్యులు దోమలగూడ పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. డబ్బుల కోసం తన కూతురిని నిత్యం వేదించడం వల్లే ఆత్మహత్య చేసుకుందని, ఇందుకు కారణమైన ఆమె భర్త మణికంఠపై చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లి ఆమీదా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డీఐ తెలిపారు.  
 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)