Breaking News

‘మార్గదర్శి’ ఎగవేతదారుల వివరాలు తెలుసుకోండి: తెలంగాణ హైకోర్టు

Published on Tue, 08/20/2024 - 12:10

హైదరాబాద్‌, సాక్షి: సుప్రీం కోర్టు ఆదేశాలతో మార్గదర్శి కేసు విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. కీలక  ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శి ఎగవేతదారుల వివరాలు తెలుసుకోవాలని, ఇందుకోసం తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ దినపత్రికల్లో నోటీసులు ఇచ్చి విస్తృత ప్రచారం కల్పించాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ.. విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. 

మార్గదర్శి కేసును ఇవాళ తెలంగాణ హైకోర్టులో డివిజన్‌ బెంచ్ విచారణ జరిపింది. జస్టిస్‌ సుజోయపాల్, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం వాదనలు వింది. ఉండవల్లి అరుణ్‌కుమార్, మార్గదర్శి న్యాయవాది సిద్దార్థ లూద్రా అన్‌లైన్‌ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఆర్‌బీఐ దాఖలు చేసిన కౌంటర్‌పై స్పందన తెలిపేందుకు రెండు వారాలు సమయం కావాలని కోరారు మార్గదర్శి లాయర్‌ లూద్రా. అయితే..

ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 45(ఎస్‌) ప్రకారం మార్గదర్శి చందాలు వసూలు చేయడం చట్టవిరుద్ధమని ఆర్‌బీఐ కౌంటర్‌లో తేల్చిందన్న విషయాన్ని ఉండవల్లి బెంచ్‌ ముందు ప్రస్తావించారు. దీనిపై పూర్తి విచారణ జరపాలని, బాధ్యులను ప్రాసిక్యూట్‌ చేయాల్సిందేనని చెప్పిందని గుర్తు చేశారు. అలాగే.. మొత్తం 70,000 చందాదారుల వివరాలు సుప్రీంకోర్టుకు మార్గదర్శి సమర్పించిందని, ఆ వివరాలను హైకోర్టుకు పెన్‌డ్రైవ్‌లో ఇచ్చేలా ఆ సంస్థను ఆదేశించాలని ఉండవల్లి కోరారు. అయితే.. 

ఆ వివరాలు కోరుతూ ఓ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఉండవల్లికి హైకోర్టు సూచించింది. ఎగవేత దారుల వివరాలు తెలుసుకునేందుకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. మరోవైపు.. రెండు వారాల్లో కౌంటర్లు వేయాలని ఏపీ, తెలంగాణ సర్కారుకు ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్‌ 11వ తేదీకి వాయిదా వేసింది. 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)