కీలక మావోయిస్టు లొంగుబాటు.. 45మంది జవాన్ల హత్యలో సూత్రధారి 

Published on Wed, 07/19/2023 - 10:52

సాక్షి, చర్ల: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 45 మంది జవాన్లను హతమార్చిన ఓ మావోయిస్టు కాంకేర్‌ జిల్లాలో బీఎస్‌ఎఫ్‌ పోలీసుల ఎదుట మంగళవారం లొంగిపోయాడు. బీజాపూర్‌ జిల్లాకు చెందిన సున్నూ మడవి అలియాస్‌ శివాజీ మావోయిస్టు పార్టీ ప్లాటూన్‌ నంబర్‌-5లో డిప్యూటీ కమాండర్‌గా పని చేస్తున్నాడు. 

అయితే, ఆ పార్టీలో పనిచేసే ఓ మహిళా మావోయిస్టును వివాహం చేసుకోవడంతో పార్టీ డీప్రమోట్‌ చేసి గంగులూరు ఏరియా కమిటీకి పంపింది. ఆ సమయంలో అతడికి అగ్రనాయకుల వేధింపులు ఎదురవడంతో పార్టీ నుంచి పారిపోయి ఇంటికి వచ్చాడు. కాగా, గ్రామంలో అప్పటికే లొంగిపోయిన కొందరు మావోయిస్టులు.. మళ్లీ పార్టీలోకి వెళ్లవద్దని, నేరుగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని సూచించడంతో కాంకేర్‌లోని బీఎస్‌ఎఫ్‌ 135 బెటాలియన్‌ పోలీసు అధికారులను ఆశ్రయించాడు.

బాలల సంఘం నుంచి డిఫ్యూటీ కమాండర్‌గా..
శివాజీ తొలుత 2005లో మావోయిస్టు పార్టీతో సంబంధాలు పెంచుకుని బాలల సంఘంలో చేరాడు. 2006లో కాంకేర్‌ జిల్లాలోని పార్తాపూర్‌ ఏరియా కమిటీ సభ్యుడిగా, ఆ తర్వాత మిలటరీ ప్లాటూన్‌ కంపెనీ నంబర్‌-5కు డిప్యూ టీ కమాండర్‌గా నియమితులయ్యాడు. ఇక, అతనిపై రూ.3 లక్షల రివార్డు ఉంది. 2009లో మదనవాడలో ఎస్పీ వినోద్‌ చౌబోతే సహా 29 మంది జవాన్లను, 2006లో దంతెవాడలో ఎనిమిది మంది సీఐఎఫ్‌ జవాన్లపై దాడి చేసి హత మార్చిన ఘటనలో మడవి అలియాస్‌ శివాజీ పాల్గొన్నాడు. 

ఇది కూడా చదవండి: బెదిరింపు కాల్స్‌ రావడంతో అజ్ఞాతంలోకి

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)