Breaking News

ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన

Published on Fri, 11/28/2025 - 09:29

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ తేదీ ప్రకటించింది. జనవరి 1న సాయుధ విరమణ చేస్తామని మావోయిస్టులు ప్రకటించారు. అందరూ కలిసి ఒకేసారి లొంగిపోనున్నట్లు మావోయిస్టు పార్టీ తెలిపింది. ఎంఎంసీ జోన్‌ ప్రతినిధి అనంత్‌ పేరుతో ప్రకటన విడుదలైంది. ‘‘ఆయుధ విరమణ అంటే ప్రజలకు ద్రోహం చేయడం కాదు. సంఘర్షణకు సరైన సమయం కాదు. అధిక ప్రాధాన్యత ఇచ్చే సర్కార్‌తో వెళ్తాం’’ అంటూ మావోయిస్టు పార్టీ పేర్కొంది.

తాము ఆయుధాలు వీడేందుకు సిద్దంగా ఉన్నామని మావోయిస్టులు ఇటీవల లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఆపరేషన్‌ కగార్‌లో భాగంగా మూడు రాష్ట్రాల్లో కూంబింగ్‌ ఆపరేషన్‌ నిలిపివేస్తే ఆయుధ విరమణ తేదీని ప్రకటిస్తామని పేర్కొనగా, తాజాగా తేదీని ప్రకటిస్తూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు.

పోలీసుల అదుపులో దేవ్‌జీ
కాగా, మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ప్రస్తుతం పార్టీకి చీఫ్‌గా కొనసాగుతున్నాడని పేర్కొంటున్న తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ పోలీసుల అదుపులో ఉన్నాడని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్‌ పేరుతో ఈనెల 22న విడుదల అయిన లేఖ గురువారం వెలుగుచూసింది.

‘మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు దేవ్‌జీతో పాటు మరో 50 మందిని పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు. వారిని వెంటనే కోర్టులో హాజరు పరచాలి. అదేవిధంగా మారేడుమిల్లి, రంపచోడవరం ఎన్‌కౌంటర్లకు నిరసనగా ఈనెల 30న భారత్‌బంద్‌ పాటించాలి. అటవీ ప్రాంతంలోని సహజ వనరులను కార్పొరేట్‌ శక్తులకు దోచిపెట్టేందుకే అక్కడి ఆదివాసీలపై ప్రభుత్వం దౌర్జన్య చర్యలకు దిగుతోంది. గిరిజన చట్టాలు అమలయ్యే రిజర్వ్‌ ఫారెస్ట్‌లో క్యాంపుల ఏర్పాటు, రోడ్లు, వంతెనల నిర్మాణం కోసం లక్షలాదిగా చెట్లను ప్రభుత్వం నరికివేస్తోంది’అని మావోయిస్టు పార్టీ పేర్కొంది.
 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)