Breaking News

లొంగుబాటలో మావోయిస్టు చీఫ్‌ దేవ్‌జీ?

Published on Sat, 02/21/2026 - 03:25

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను తుద ముట్టిస్తామని విధించిన గడువు అయిన మార్చి 31 సమీపిస్తున్న వేళ మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. గెరిల్లా వార్‌ చేయడానికి అనుకూలమైన పరిస్థితులు మృగ్యమై పోవడంతో లొంగుబాటు తప్పదనే దిశగా ఆ పార్టీ అగ్ర నాయకత్వం అడుగులు వేసిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. సురక్షిత లొంగుబాటుకు తెలంగాణను వేదికగా చేసుకోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.

మావోయిస్టు పార్టీకి సుప్రీం కమాండర్‌గా తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ(Devji)ని ఎన్నుకున్నట్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు చంద్రన్న గతంలో ప్రకటించారు. అయితే దేవ్‌జీని ఎన్నుకున్న సమాచారం తమవరకు రాలేదని ఆ పార్టీ మాజీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌ వంటివారు వెల్లడించారు. అయితే, దేవ్‌జీ జనరల్‌ సెక్రటరీనా.. కాదా అన్న చర్చను పక్కకు పెడితే, ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి ఆయనే పెద్దదిక్కు అనే అంశంపై ఎవరికీ పెద్దగా సందేహాలు లేవు. అయితే, మారిన పరిస్థితుల నేపథ్యంలో గెరిల్లా తరహా సాయుధ పోరాటం చేయడం కష్టమనే నిర్ణయానికి ఆయన వచ్చినట్టు తెలుస్తోంది.

దీంతో లొంగుబాటు కోసం తెలంగాణ ‘పెద్దల’కు టచ్‌లోకి వచ్చినట్టు సమాచారం. దేవ్‌జీతోపాటు మరో కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్‌ సంగ్రామ్‌ కూడా లొంగుబాటు కోసం తన సొంత రాష్ట్రానికి వచ్చినట్టు తెలుస్తోంది. 

ఆపరేషన్‌.. కర్రె గుట్టలు– 2: తీవ్ర నిర్బంధంతో మావోయిస్టు నాయకత్వం, శ్రేణులు ఉక్కిరిబిక్కిరైన సమయంలో ఆపరేషన్‌ కర్రె గుట్టలు–2ను ఈనెల 18న భద్రతా దళాలు ప్రారంభించాయి. తెలంగాణ–ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో మావోయిస్టు పార్టీ చీఫ్‌ దేవ్‌జీ అలియాస్‌ చేతన్‌తోపాటు పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ బాధ్యతలు చూస్తున్న కేసా సోదిలను   లక్ష్యంగా చేసుకొని ఈ ఆపరేషన్‌ ప్రారంభించినట్టు పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి.

కనీసం కాలు కూడా కదపలేని స్థితికి నిర్బంధం పెరగడం... చివరకు దేవ్‌జీతోపాటు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మల్లా రాజిరెడ్డి అలియాస్‌ సంగ్రామ్‌ లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ మేరకు తమకున్న పరిచయాల ద్వారా తెలంగాణ ‘పెద్దల’టచ్‌లోకి వెళ్లినట్టు సమాచారం. రాబోయే నాలుగైదు రోజుల్లో ఈ అంశంపై ఓ స్పష్టత వచ్చే అవకాశముంది. వీరిద్దరితోపాటు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సీనియర్, జూనియర్‌ కేడర్‌ కూడా లొంగిపోయే అవకాశమున్నట్టు తెలుస్తోంది. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)