Breaking News

పిచ్చికుక్కల స్వైరవిహారం.. 26 మంది చిన్నారులకు గాయాలు

Published on Fri, 12/06/2024 - 05:59

మహబూబ్‌నగర్‌ క్రైం/గూడూరు: వేర్వేరు జిల్లాల్లో పిచ్చికుక్కల దాడిలో 26 మంది చిన్నారులు గాయపడ్డారు. మహబూబ్‌నగర్‌ పట్టణంలో గురువారం రాత్రి 7 – 8.30 గంటల ప్రాంతంలో గోల్‌ మజీద్, పాత పాలమూరు ఏరియాలో ఒక పిచ్చికుక్క చిన్నారులను వెంటాడి కరుస్తూ గాయపరిచింది. గాయపడిన 24 మంది చిన్నారులకు జనరల్‌ ఆస్పత్రిలో టీటీ ఏఆర్‌వీ టీకాలు ఇచ్చారు.

ఇందులో ఐదుగురు చిన్నారులకు గాయాలు ఎక్కువ కావడంతో.. వారిని ఆస్పత్రిలో చేర్పించుకుని పరిశీలనలో ఉంచినట్లు ఆర్‌ఎంవో డాక్టర్‌ జరీనా తెలిపారు. చిన్నారులను గురువారం రాత్రి జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌ పరామర్శించారు. పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే వైద్యాధికారులను ఆదేశించారు. కుక్కలను దూర ప్రాంతాలకు తరలించాలని మున్సిపల్‌ కమిషనర్‌కు సూచించారు. 

మహబూబాబాద్‌ జిల్లాలో.. : మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం కొల్లాపురానికి చెందిన మహేశ్‌ కూతురు స్మైలీ, కారం సుమన్‌ కుమారుడు అచ్చితానంద.. గురువారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుండగా, పిచ్చికుక్క వీరిద్దరిపై దాడికి పాల్పడింది. కుటుంబసభ్యులు చిన్నారులను కుక్క బారి నుంచి కాపాడారు. గాయపడిన చిన్నారులను మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)