Breaking News

‘మన్‌ కీ బాత్‌’థీమ్‌.. గోల్కొండలో సౌండ్‌ అండ్‌ లైట్‌ షో  

Published on Fri, 04/28/2023 - 11:15

సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌ నగరంలోని గోల్కొండ కోటలో ఈ నెల 29న ‘మన్‌ కీ బాత్‌’థీమ్‌తో ప్రత్యేకమైన సౌండ్‌ అండ్‌ లైట్‌ షోను కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ నెల 30 న ఆల్‌ ఇండియా రేడియో ద్వారా ప్రసారం కానున్న మన్‌ కీ బాత్‌ 100 వ ఎపిసోడ్‌ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనుంది.

మన్‌ కీ బాత్‌కు సంబంధించిన ఎంపిక చేసిన కొన్ని థీమ్స్‌ను పురావస్తు శాఖ అధీనంలో దేశవ్యాప్తంగా ఉన్న 13 చారిత్రక కట్టడాల్లో సౌండ్‌ అండ్‌ లైట్‌ షో ద్వారా ప్రదర్శించనున్నారు. అందులో భాగంగా ఢిల్లీలోని ఎర్రకోట, గ్వాలియర్‌ కోట, సూర్య దేవాలయం, వెల్లూరు కోట, గేట్‌ వే ఆఫ్‌ ఇండియా, నవ్‌నతన్‌ ఘడ్‌ కోట, రాంనగర్‌ ప్యాలెస్, ది రెసిడెన్సీ భవనం, గుజరాత్‌లోని సూర్య దేవాలయం, రాంఘడ్‌ కోట, చిత్తోర్‌ఘడ్‌ కోట, ప్రధాని సంగ్రహాలయతో పాటు హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలోనూ ‘మన్‌ కీ బాత్‌’కు సంబంధించిన ప్రత్యేక ప్రదర్శనలను చేపట్టనున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ గురువారం తెలిపారు. 

‘మన్‌ కీ బాత్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌’
మరోవైపు మన్‌ కీ బాత్‌ థీమ్‌ ఆధారంగా దేశంలో ప్రసిద్ధి పొందిన 12 మంది చిత్రకారులు వేసిన పెయింటింగ్స్, ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ను ఈ నెల 30 న ఢిల్లీలో ప్రారంభించనున్నారు.  ఈ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌లో నీటి పొదుపు, నారీశక్తి, కోవిడ్‌పై అవగాహన, స్వచ్ఛ భారత్, వాతావరణ మార్పు, రైతాంగం–వ్యవసాయం, యోగా – ఆయుర్వేదం, సైన్స్‌–ఖగోళ శాస్త్రం, క్రీడలు–ఫిట్‌నెస్, భారత్‌ ఎట్‌ 75 అమృత్‌ కాల్, ఈశాన్య రాష్ట్రాలు అనే 12 రకాల థీమ్స్‌ ఉంటాయి. దీంతో పాటు 12 అమర్‌చిత్ర కథ కామిక్స్‌లో మొదటి కామిక్‌ను ఈ నెల 30 న విడుదల చేయనున్నట్లు గోవింద్‌ మోహన్‌ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: సాగర తీరాన ధగధగల సౌధం

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)